Biggboss : బిగ్ బాస్ 9 తెలుగులో డబుల్ ట్విస్ట్.. ఫ్లోరా ఎలిమినేషన్.. వైల్డ్ కార్డ్స్ చేతుల్లో శ్రీజ బలి

Biggboss : బిగ్ బాస్ 9 తెలుగులో డబుల్ ట్విస్ట్.. ఫ్లోరా ఎలిమినేషన్.. వైల్డ్ కార్డ్స్ చేతుల్లో శ్రీజ బలి
x

Biggboss : బిగ్ బాస్ 9 తెలుగులో డబుల్ ట్విస్ట్.. ఫ్లోరా ఎలిమినేషన్.. వైల్డ్ కార్డ్స్ చేతుల్లో శ్రీజ బలి

Highlights

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అసలు సిసలు వైల్డ్ ఎంట్రీలుగా మారాయి.

Biggboss : బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అసలు సిసలు వైల్డ్ ఎంట్రీలుగా మారాయి. సీజన్ మరింత రసవత్తరంగా మారడానికి సిద్ధమవుతున్న తరుణంలో, హోస్ట్ నాగార్జున ముందుగా ఒక ఎలిమినేషన్ పూర్తి చేసి, ఆ తర్వాత ఆరుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించి పెద్ద సంచలనం సృష్టించారు. ముఖ్యంగా ప్రతి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌కు ఒక్కో బిగ్ బాస్ హోస్ట్ ద్వారా ఒక సూపర్ పవర్ స్టోన్ ఇవ్వడం ఈ ఎంట్రీలలో హైలైట్‌గా నిలిచింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముందు, హౌస్ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. రీతూ, ఫ్లోరాలలో ఫ్లోరా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. వెళ్లేముందు ఫ్లోరా సంజనను మిస్ అవుతానని కన్నీళ్లు పెట్టుకోగా, పవన్‌ను మిస్ అవుతానని రీతూ కూడా ఎమోషనల్ అయ్యింది. ఫ్లోరా హౌస్ నుంచి వెళ్తూ.. సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్, శ్రీజ దమ్ముకి థంబ్స్ అప్ ఇచ్చింది. భరణి, తనూజ, సుమన్ శెట్టికి థంబ్స్ డౌన్ ఇచ్చి తన అభిప్రాయాన్ని తెలిపింది.

ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీల సందడి తర్వాత, చివరిలో నాగార్జున ఎలిమినేషన్ నిర్ణయాన్ని కొత్త వైల్డ్ కార్డ్స్ చేతుల్లో పెట్టారు. అందరూ కలిసి శ్రీజను ఎలిమినేట్ చేశారు. శ్రీజ వెళ్తూ.. భరణిని ఎనిమీగా, కళ్యాణ్‌ను ట్రస్ట్‌గా పేర్కొంది.

ఆదివారం (అక్టోబర్ 12) జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఈ ఆరుగురు కొత్త సభ్యులను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌లుగా హౌస్‌లోకి పంపించారు.

రమ్య మోక్ష : ఈమె అలేఖ్య చిట్టి పికెల్స్ పేరుతో పచ్చళ్ల వ్యాపారం చేసి, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీ. హౌస్‌లోకి రాగానే రమ్య.. శ్రీజ (ఓవరాక్షన్), భరణి (సేఫ్ గేమ్), రాము (మానిప్యులేటర్), దివ్య నిఖిత (ఫేక్) వంటి హౌస్‌మేట్స్‌కు పికెల్స్ ఇచ్చి రచ్చ మొదలుపెట్టింది. నాగార్జున ఆమెకు లగ్జరీ ఫుడ్ పవర్ ఉపయోగించుకునే పవర్ స్టోన్ ను బహుమతిగా ఇచ్చారు.

శ్రీనివాస్ సాయి : బాల నటుడిగా పలు సినిమాల్లో నటించి పాపులర్ అయిన సాయి, రెండో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాల్లో నటించాడు. నాగార్జున ఇతనికి ఇమ్యూనిటీ పవర్‌గా బ్లూ స్టోన్ ను ఇచ్చారు.

దువ్వాడ మాధురి : దువ్వాడ (దివ్వెల) మాధురి సోషల్ మీడియా రీల్స్, టెక్కలి వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో ఉన్న సంబంధం కారణంగా ప్రధాన మీడియాలో పాపులర్ అయ్యింది.

నిఖిల్ నాయర్ : పలుకే బంగారమాయెనే , గృహలక్ష్మి వంటి సీరియల్స్‌తో అభిమానులను సంపాదించుకున్న నటుడు నిఖిల్ నాయర్ ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా, ఈయన కొత్త కెప్టెన్ బ్యాడ్జ్‌తో హౌస్‌లోకి ప్రవేశించడం విశేషం.

ఆయేషా జీనత్ : ఈ క్యూట్ నటి మాటీవీ సీరియల్ సావిత్రి కొడుకు ద్వారా ఫేమస్ అయింది. తమిళ బిగ్ బాస్‌లో కూడా పాల్గొన్న అనుభవం ఈమెకు ఉంది.

గౌరవ్ గుప్తా : మాటీవీలో వచ్చిన గీత ఎల్ఎల్బీ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ నటుడు గౌరవ్ గుప్తా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీల విషయంలో బిగ్ బాస్ ఈసారి ఒక పెద్ద ట్విస్ట్‌ను అమలు చేశాడు. సీరియల్ హీరోయిన్లు సుహాసిని, కావ్య శ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారని అందరూ బలంగా ఊహించారు. అయితే, వారిద్దరూ రాకుండా ఆడియన్స్ అంచనాలకు భిన్నంగా ఈ ఆరుగురు కొత్త సభ్యులతో పాటు మొదట వచ్చిన రమ్య మోక్ష హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈ అనూహ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీలు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో పోటీని, వినోదాన్ని మరింతగా పెంచనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories