Bigg Boss Telugu 9: ట్రైన్ టాస్క్‎లో దద్దరిల్లిన హౌస్.. దివ్య వర్సెస్ తనూజ, రీతూ వర్సెస్ దివ్య – రచ్చ రచ్చే

Bigg Boss Telugu 9
x

Bigg Boss Telugu 9: ట్రైన్ టాస్క్‎లో దద్దరిల్లిన హౌస్.. దివ్య వర్సెస్ తనూజ, రీతూ వర్సెస్ దివ్య – రచ్చ రచ్చే

Highlights

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లో కెప్టెన్సీ టాస్క్‌లు ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధాన్ని, ఆధిపత్య పోరును తారస్థాయికి చేర్చాయి.

Biggboss 9 : బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లో కెప్టెన్సీ టాస్క్‌లు ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధాన్ని, ఆధిపత్య పోరును తారస్థాయికి చేర్చాయి. ముఖ్యంగా తాజా ట్రైన్ టాస్క్‎లో కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి ఇంటి సభ్యులను తప్పించే అవకాశం రావడంతో దివ్య, తనూజ మధ్య వ్యక్తిగత కారణాలతో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అలాగే, సాయి కన్ఫ్యూజన్ వల్ల రీతూ‎, దివ్య మధ్య కూడా గొడవ మొదలైంది. ఒకవైపు హౌస్‌లో తనూజ ఒంటరి పోరాటం కొనసాగిస్తుంటే, మరోవైపు ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఆమెను ఎలిమినేషన్ గండం నుంచి కాపాడుతూ వస్తోంది.

తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన ట్రైన్ టాస్క్‎లో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ టాస్క్‌లో డ్రైవర్ సీట్‌లో కూర్చున్నవారు కెప్టెన్సీ రేస్ నుంచి ఒకరిని తొలగించవచ్చు. డ్రైవర్ సీట్‌ను దక్కించుకున్న దివ్య, తాను ఇమ్మాన్యువల్‌కు మద్దతిస్తున్నానని స్పష్టం చేస్తూ, తనూజను రేస్ నుంచి తొలగించింది. దివ్య తనను వ్యక్తిగత కారణాల (భరణి విషయంలో దివ్యతో ఉన్న గొడవ) వల్లే టార్గెట్ చేసిందని, ఆ పర్సనల్ విషయాలను టాస్క్‌లోకి తీసుకురావద్దని తనూజ కోపంతో అరిచింది.

"భరణి సార్ కోసమే నన్ను తీసేస్తున్నావ్ అని చెప్పు" అంటూ తనూజ గట్టిగా అరుస్తుంది. అయితే దివ్య కూల్‌గా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించినా, తనూజ వినకుండా నాతో మాట్లాడకు అంటూ లోపలికి వెళ్లి బెడ్ పై పడుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తనను అందరూ ఒంటరిని చేస్తున్నారని ఆవేదన చెందింది. సాయి కన్ఫ్యూజన్ వల్ల రీతూ, దివ్య మధ్య మాటల యుద్ధం జరిగింది.

టాస్క్‌లో భాగంగా సాయి డ్రైవర్ సీట్‌ను దక్కించుకున్నాడు. ఎవరిని తీయాలో ఆలోచిస్తుండగా, రీతూ చౌదరి దివ్య వైపు సైగ చేసింది. దీంతో సాయి మొదట దివ్య పేరు చెప్పి, ఆ వెంటనే యూ టర్న్ తీసుకుని రీతూ చౌదరి పేరు చెప్పి ఆమెను రేస్ నుంచి తప్పించాడు. దీనితో రీతూ ఆగ్రహంతో ఊగిపోయింది. "పక్కవాళ్ళు చెప్పిన మాటలు విని, నన్ను తీసేయడానికి నువ్వు ఎవరు?" అంటూ సాయిపై ఫైర్ అయ్యింది. అలాగే, "నువ్వే కదా దివ్యను తీస్తానని చెప్పావ్, మళ్లీ నన్ను తీయడం ఏంటి?" అంటూ దివ్యను కూడా గొడవలోకి లాగింది. దివ్య మాత్రం "నేను కెప్టెన్ అయ్యాను, డోంట్ కేర్" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. సాయి కన్ఫ్యూజన్ చివరికి ఇద్దరు స్ట్రాంగ్ కంటెండర్ల మధ్య గొడవకు దారితీసింది.

హౌస్‌లో తనకు అండగా నిలుస్తారని నమ్మిన కళ్యాణ్ కూడా శ్రీజ మాటలు విని దూరంగా ఉండటం, భరణితో బంధం బ్రేక్ అవడం, దివ్య శత్రువుగా మారడం వంటి కారణాల వల్ల తనూజ ఒంటరిగా మారింది. ఈ వారం ఇమ్మాన్యువల్ కెప్టెన్ అయ్యాడు. తొమ్మిదో వారం ఎలిమినేషన్ కోసం భరణి, తనూజ, సుమన్, రాము, సాయి శ్రీనివాస్, సంజన, కళ్యాణ్ నామినేషన్లలో ఉన్నారు. హౌస్‌లో తనూజకు వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. కళ్యాణ్ కూడా రెండో స్థానంలో దూసుకుపోతున్నాడు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్‌కు తనను నిరూపించుకోవడానికి సరైన టాస్క్‌లు రాలేదు. ఇక రాము రాథోడ్ అయితే, ఇంటిపై బెంగతో ఏ గేమ్‌లోనూ ఆడటానికి ఇష్టం చూపడం లేదు. తనంతట తానే గివ్ అప్ ఇస్తున్నాడు. ఈ కారణంగా వీక్షకులు రామును ఎలిమినేట్ చేస్తే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. దీంతో రాము లేదా సాయి శ్రీనివాస్‌లలో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories