Bigg Boss 9 Telugu Elimination: బిగ్ బాస్ మొదటి ఎలిమినేషన్.. శ్రష్టి వర్మ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Bigg Boss 9 Telugu Elimination: బిగ్ బాస్ మొదటి ఎలిమినేషన్.. శ్రష్టి వర్మ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
x
Highlights

Bigg Boss 9 Telugu Elimination: ఈ నామినేషన్స్ తర్వాత, శ్రష్టి వర్మ లేదా ఫ్లోరా షైని ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ 9వ సీజన్‌ మొదటి వారం ముగిసింది. నామినేషన్స్ తర్వాత టెనెంట్స్‌లో భరణి తప్ప అందరూ నామినేట్ అయ్యారు. అలాగే ఓనర్ల నుంచి పవన్ నామినేట్ అయ్యాడు. ఈ నామినేషన్స్ తర్వాత, శ్రష్టి వర్మ లేదా ఫ్లోరా షైని ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు.

ఆ నెగటివిటీ వల్లే షాక్​కు గురైందా?

ప్రేక్షకులు ఊహించినట్టే, తక్కువ ఓట్లు రావడంతో శ్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి వారంలోనే బయటకు వెళ్ళిపోయింది. ఈ విషయంపై లీక్స్ నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మొదటి వారంలో శ్రష్టి వర్మ ఏ విషయంలోనూ హైలైట్ కాలేదు. ఆమె పేరు ఒక్క ఎపిసోడ్‌లో కూడా పెద్దగా వినిపించలేదు.

శ్రష్టి వర్మకు సోషల్ మీడియాలో జానీ మాస్టర్ వల్ల నెగటివిటీ ఉందని అందరికీ తెలిసిందే. ఆ నెగటివిటీ ఇప్పుడు ఓటింగ్​పై ప్రభావం చూపించిందని చెబుతున్నారు. మొదటి వారంలో శ్రష్టి వర్మ తన ముద్రను వేయలేకపోయింది. అందుకే ప్రజలు ఆమెకు ఓటు వేయలేదని వార్తలు వస్తున్నాయి.

అనధికారిక ఓటింగ్ ఫలితాలు..

ఈ వారం ఎలిమినేషన్ కోసం ఇమ్మాన్యుయేల్, తనుజ, శ్రష్టి వర్మ, సంజన గల్రాని, దీమన్ పవన్, రితు చౌదరి, ఫ్లోరా షైని, సుమన్ శెట్టి, రాము రాథోడ్ నామినేట్ అయ్యారు. వీరిలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిందని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని, రేపటి ఎపిసోడ్‌లో ప్రసారం అవుతుందని తెలుస్తోంది. ఈ ఎలిమినేషన్ కొంచెం ఊహించనిదని చెప్పవచ్చు.

శ్రష్టి వర్మ ఒక మంచి టాలెంటెడ్ కంటెస్టెంట్. మొదటి వారంలో ఆమె తన టాలెంటును పూర్తి స్థాయిలో చూపించలేకపోయింది. రెండో వారంలో టాస్క్‌లు మొదలైతే ఆమె టాలెంట్ బయటపడే అవకాశం ఉంది. కానీ, దురదృష్టవశాత్తు ఆమె మొదటి వారంలోనే ఎలిమినేట్ అయింది. నామినేట్ అయిన కంటెస్టెంట్లలో శ్రష్టి వర్మ, ఫ్లోరా షైని తక్కువ ఓట్లు పొందారు. ఫ్లోరా షైనికి కొంచెం ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె సేఫ్ అయింది.

రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

శ్రష్టి వర్మ ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్, అందుకే ఆమెకు మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు. కేవలం ఒక వారం మాత్రమే హౌస్‌లో ఉన్నందుకు, ఆమె దాదాపు రూ.1.5లక్షలు రెమ్యూనరేషన్ సంపాదించిందని వార్తలు వస్తున్నాయి. ఆమె కనీసం రెండు, మూడు వారాలైనా హౌస్‌లో ఉండి ఉంటే బాగుండేదని చాలా మంది సోషల్ మీడియాలో చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories