Biggboss 9: సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తాలకు కెప్టెన్సీ..మాధురి డ్రామా, ఆయేషా-రీతూల మధ్య మళ్లీ రచ్చ

Biggboss 9: సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తాలకు కెప్టెన్సీ..మాధురి డ్రామా, ఆయేషా-రీతూల మధ్య మళ్లీ రచ్చ
x

Biggboss 9: సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తాలకు కెప్టెన్సీ..మాధురి డ్రామా, ఆయేషా-రీతూల మధ్య మళ్లీ రచ్చ

Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 40వ ఎపిసోడ్ ప్రేక్షకులను అలరించింది. పాత కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల మధ్య మాటల యుద్ధం, డ్రామా, ఎమోషన్‌లతో హౌజ్ సందడి వాతావరణాన్ని సంతరించుకుంది.

Biggboss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 40వ ఎపిసోడ్ ప్రేక్షకులను అలరించింది. పాత కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల మధ్య మాటల యుద్ధం, డ్రామా, ఎమోషన్‌లతో హౌజ్ సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ వారంలో బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ టాస్క్‌లో విజేతలుగా నిలిచిన సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తా సంయుక్తంగా ఏడో వారానికి కెప్టెన్లుగా ఎన్నికయ్యారు. ఇది బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి ఇద్దరిని సంయుక్త కెప్టెన్లుగా ప్రకటించడం విశేషం. కెప్టెన్సీ బ్యాడ్జ్ ధరించిన తర్వాత సుమన్ శెట్టి తన మొదటి చిత్రం జయంను గుర్తు చేసేలా అధ్యక్షా! అంటూ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.

కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ కంటెండర్లకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. "మొదటిసారిగా ఇంట్లో ఇద్దరు కెప్టెన్లు ఉంటారు, కాబట్టి మీ భాగస్వామిని జాగ్రత్తగా ఎంచుకోండి" అని సూచించాడు. దీంతో రమ్యతో టీమ్ అప్ అవ్వాలని దివ్వెల మాధురి అనుకుంది. అయితే రమ్య, సాయి కలిసి టీమ్‌గా ఆడాలని నిర్ణయించుకోవడంతో మాధురి హర్ట్ అయ్యింది. "నన్ను ఈ రోజు నువ్వు చాలా బాధపెట్టావ్ రమ్య. ఈ హౌజ్‌లో నాకు నీ సపోర్ట్ ఉందనుకున్నాను, కానీ లేదని ఇప్పుడు తెలిసింది. సింగిల్‌గా వచ్చాను, సింగిల్‌గానే ఆడి పోతాను" అంటూ మాధురి డైలాగులు కొట్టింది. చివరికి మాధురి-ఆయేషా, సుమన్-గౌరవ్, సాయి-రమ్య టీమ్స్‌గా విడిపోయారు. కెప్టెన్సీ టాస్క్‌లో సుమన్ శెట్టి-గౌరవ్ గుప్తా జంట విజయం సాధించింది. టాస్క్ ఓడిపోయినందుకు ఆయేషా "నా కన్ను వల్ల పోయింది మేడమ్. నా లోపం వల్ల పోయింది. నాకు కనబడలేదు" అంటూ తన చెంప మీద తానే కొట్టుకుంటూ ఏడ్చింది. మాధురి కూడా ఏడ్వడంతో అందరూ వారిని ఓదార్చారు.

సుమన్ శెట్టి, గౌరవ్‌లు కెప్టెన్లు అయిన సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. నిఖిల్ తన కంటెండర్ పవర్‌ను ఉపయోగించి కొత్త కెప్టెన్స్‌లో ఒకరిని ఛాలెంజ్ చేయొచ్చని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కొద్దిసేపు ఆలోచించిన నిఖిల్, గౌరవ్‌ను తన ప్రత్యర్థిగా ఎన్నుకున్నాడు. మరోవైపు, ఇంటిలో గొడవలకు మాత్రం బ్రేక్ పడలేదు. డ్రెస్ ఐరన్ చేయమని కల్యాణ్ అడగ్గా, ఆయేషా తీవ్రంగా స్పందించింది. "ఎవరి పనో నేను ఎందుకు చేయాలిరా. నువ్వు కావాలంటే నీకు నచ్చినవాళ్ల డ్రెస్‌లు ఉతుక్కో, ఆరబెట్టుకో, ఐరన్ చేసుకో, నాకేం కర్మ" అంటూ కల్యాణ్‌కు గట్టిగానే క్లాస్ పీకింది. కిచెన్లో ఆయేషా, రీతూ చౌదరీల మధ్య పనులపై మళ్ళీ ఘర్షణ జరిగింది. పవన్ కూడా జోక్యం చేసుకోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది.

బిగ్ బాస్ ఇంట్లో వ్యూహాలు కూడా కొనసాగుతున్నాయి. ఇమ్మాన్యుయెల్, సంజనతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భరణి, ఇమ్మాన్యుయెల్‌తో "నేను డేంజర్‌లో ఉన్నప్పుడు.. ఇంట్లో ఎవరూ నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా" అని అడిగాడని చెప్పాడు. దీనికి సంజన ఆశ్చర్యపోయి, ఇమ్మా దగ్గర పవరాస్త్ర ఉంది కాబట్టి భరణి అతన్ని ముందే లాక్ చేసుకుంటున్నాడని కామెంట్ చేసింది. వచ్చే ఎపిసోడ్‌లో జంట కెప్టెన్సీ ఎలా పనిచేస్తుందో, నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్ల భవితవ్యం ఏమిటో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories