Bigg Boss 9 : ఏడవ వారం ఓటింగ్‌లో భారీ మార్పులు.. టాప్ 2లో తనూజ, కళ్యాణ్.. డేంజర్ జోన్‌లో రాము, రమ్య!

Bigg Boss 9 : ఏడవ వారం ఓటింగ్‌లో భారీ మార్పులు.. టాప్ 2లో తనూజ, కళ్యాణ్.. డేంజర్ జోన్‌లో రాము, రమ్య!
x

Bigg Boss 9 : ఏడవ వారం ఓటింగ్‌లో భారీ మార్పులు.. టాప్ 2లో తనూజ, కళ్యాణ్.. డేంజర్ జోన్‌లో రాము, రమ్య!

Highlights

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 9వ సీజన్ ఆరో వారం పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి అడుగుపెట్టింది.

Bigg Boss 9 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 9వ సీజన్ ఆరో వారం పూర్తి చేసుకుని ఏడవ వారంలోకి అడుగుపెట్టింది. గత సీజన్ల మాదిరిగానే హౌస్‌మేట్స్ మధ్య అరుపులు, గొడవలు, పర్సనల్ అటాక్‌లు హౌస్‌ను హాట్‌గా మారుస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్, ఓటింగ్‌లో ఊహించని మార్పులు జరిగాయి. డేంజర్ జోన్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్‌కు ఓట్లు పెరగడం, ఒక కంటెస్టెంట్‌పై ఉన్న కోపంతో ఆడియన్స్ ఇంకొకరికి ఓట్లు గుద్ది పడేయడం వంటి పరిణామాలు జరిగాయి.

బిగ్ బాస్ హౌస్‌లో ఆరో వారం పూర్తయిన తర్వాత, ఏడవ వారం నామినేషన్లలో మొత్తం 7 మంది ఉన్నారు. రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, రాము రాథోడ్, తనూజ, రమ్య మోక్ష, కళ్యాణ్ పడాల, సంజన, దివ్య నిఖిత. ఈ వారం నామినేషన్లలో ఉన్న తనూజ 38% ఓటింగ్‌తో టాప్‌లో దూసుకుపోతోంది. ఈ వారంలో ఇమ్మాన్యుయేల్‌తో గొడవ, కళ్యాణ్‌తో సాన్నిహిత్యం కారణంగా ఆమెకు సింపతీ ఓటింగ్ బాగా పెరిగినట్లు తెలుస్తోంది.

తనూజ తర్వాత కళ్యాణ్ పడాల 20% ఓటింగ్‌తో రెండో స్థానంలో స్థిరంగా ఉన్నాడు. వీరిద్దరికీ మొదట్నుంచీ పాజిటివ్ ఓటింగ్ వస్తోంది. ఈ వారం ఓటింగ్‌లో అనూహ్యంగా జరిగిన అతిపెద్ద మార్పు దివ్య నిఖిత విషయంలోనే. దివ్య నిఖిత 11% ఓట్లతో అకస్మాత్తుగా మూడో స్థానంలోకి దూసుకువచ్చింది. వాస్తవానికి, గత వారాల్లో ఆమెకు తక్కువ ఓటింగ్ వచ్చింది. అయితే, ఈ వారం ఆమెకు ఓట్లు పెరగడానికి కారణం రమ్య మోక్షే.

పచ్చళ్ల పాప రమ్య మోక్ష.. హౌస్‌లో తన ఓవరాక్షన్, నోటి దురుసు.. తనూజ, కళ్యాణ్‌లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో ఆడియన్స్ ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రమ్యకు నెగిటివిటీ పెరగడంతో, ఆమెను ఎలాగైనా హౌస్ నుంచి బయటకు పంపించాలనే ఉద్దేశంతో ఆడియన్స్.. రమ్యకు పోటీగా ఉన్న దివ్య నిఖితకు ఓట్లు గుద్ది పడేస్తున్నారు. ఈ రివేంజ్ ఓటింగ్ కారణంగానే దివ్య నిఖిత అనూహ్యంగా మూడో స్థానంలోకి వచ్చి సేఫ్ అయ్యింది.

ప్రస్తుతం దివ్య నిఖిత తర్వాత రీతూ చౌదరి, సంజన, సాయి శ్రీనివాస్ ఉన్నారు. రాము రాథోడ్, రమ్య మోక్ష ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఆన్‌లైన్ పోల్స్‌లో రమ్య మోక్ష అన్నింటికంటే లీస్ట్ ఓటింగ్‌లో ఉండటం గమనార్హం. నిజానికి బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ విషయంలో ఓటింగ్ అనేది ఒక అపోహ మాత్రమేనని నిరూపితమైంది. దమ్ము శ్రీజ, భరణి శంకర్‌ల వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లు కూడా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. దీనిని బట్టి చూస్తే, హౌస్‌లో ఎవర్ని ఉంచాలి, ఎవర్ని పంపించాలి అనేది ప్రేక్షకులతో పాటు, బిగ్ బాస్ నిర్వాహకుల చేతిలో కూడా ఉంటుందని అర్థమవుతోంది. ఓటింగ్ ప్రకారం రమ్య మోక్ష లీస్ట్‌లో ఉన్నప్పటికీ, ఆమె కాకుండా మరొకరిని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories