Bigg Boss 9 : నామినేషన్స్ హీట్.. కొత్త వైల్డ్ కార్డ్స్ సంచలనం.. ఒక్క రోజులోనే కెప్టెన్ కళ్యాణ్ తో మాధురి గొడవ!

Bigg Boss 9 : నామినేషన్స్ హీట్.. కొత్త వైల్డ్ కార్డ్స్ సంచలనం..  ఒక్క రోజులోనే కెప్టెన్ కళ్యాణ్ తో మాధురి గొడవ!
x
Highlights

Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు 9 షో ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఐదో వారం డబుల్ ఎలిమినేషన్‌లో ఫ్లోరా సైనీ, శ్రీజలు హౌస్‌ను వీడగా, అదే సమయంలో ఆరుగురు కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చి హౌస్‌లో ఒక్కసారిగా ఉత్సాహం నింపారు.

Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు 9 షో ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఐదో వారం డబుల్ ఎలిమినేషన్‌లో ఫ్లోరా సైనీ, శ్రీజలు హౌస్‌ను వీడగా, అదే సమయంలో ఆరుగురు కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చి హౌస్‌లో ఒక్కసారిగా ఉత్సాహం నింపారు. కొత్త కంటెస్టెంట్ల రాకతోనే హౌస్‌లో పెద్ద యుద్ధమే మొదలైంది. ముఖ్యంగా కొత్తగా వచ్చిన దివ్వెల మాధురి, రమ్య మోక్ష అప్పుడే పాత కంటెస్టెంట్లపై గట్టిగానే ఫైర్ అవుతున్నారు. నామినేషన్ల ప్రక్రియకు ముందు కిచెన్‌లో కెప్టెన్ కల్యాణ్, మాధురి మధ్య జరిగిన వాగ్వాదం, అలాగే దివ్య-భరణి రిలేషన్‌షిప్‌పై రమ్య చేసిన షాకింగ్ కామెంట్స్.. ఇవన్నీ హౌస్‌లో టెన్షన్ పెంచాయి.

బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్‌లో ఫ్లోరా సైనీ, శ్రీజ ఒకేసారి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటి వరకు హౌస్‌ను వీడిన ఆరుగురు కంటెస్టెంట్లలో నలుగురు కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు కాగా, ఇద్దరు సెలబ్రిటీలు మాత్రమే ఉన్నారు. అదే సమయంలో, ఆరుగురు కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు (మాధురి, రమ్య మోక్ష, నిఖిల్ నాయర్, సుమన్ శెట్టి, సంజన, ఇమ్మాన్యుయెల్) హౌస్‌లోకి అడుగుపెట్టి కొత్త ఎనర్జీని తీసుకొచ్చారు.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకతోనే హౌస్‌లో గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా దివ్వెల మాధురి మొదటి రోజే తన ఫైర్‌ను చూపించింది. కిచెన్‌లో కెప్టెన్ కళ్యాణ్, మాధురి మధ్య మాటల యుద్ధం జరిగింది. "కూర్చోపోతే చెప్పరా?" అని కళ్యాణ్ సరదాగా రియాక్ట్ అవ్వడంతో మాధురి రెచ్చిపోయింది. "ఏంటి వేరేలా మాట్లాడటం అంటే ఎలా మాట్లాడతారు? చూపించండి!" అంటూ గొడవ చేసింది. ఈ గొడవలో దివ్య, భరణి కూడా జోక్యం చేసుకున్నారు. చివరకు మాధురి కన్నీళ్లు పెట్టుకోవడంతో, కళ్యాణే వచ్చి సారీ చెప్పాల్సి వచ్చింది. దీంతో మాధురి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ మొదలవడానికి బదులుగా, భావోద్వేగాల డ్రామాతో చర్చనీయాంశమైంది.

హౌస్‌లో మరొక కొత్త కంటెస్టెంట్ అయిన రమ్య మోక్ష, దివ్యపై చేసిన కామెంట్లు మరింత టెన్షన్ పెంచాయి. రమ్య, మాధురితో మాట్లాడుతూ, "దివ్య, భరణితోనే ఉండటానికే బిగ్ బాస్‌లోకి వచ్చిందా?" అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఈ కామెంట్ల గురించి తెలుసుకున్న దివ్య బాధపడింది. భరణి, రాము, పవన్ వద్ద తన గోడు వెళ్లబోసుకుంటూ.. "ఎందుకు నా గురించే మాట్లాడుతున్నారు?" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. భరణి, రాము ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. రమ్య, మాధురితో మాట్లాడుతూ కెప్టెన్ కళ్యాణ్‌ను కూడా అమ్మాయి పిచ్చోడు అంటూ పర్సనల్ కామెంట్లు చేసింది. తను తనూజతో బిహేవ్ చేస్తున్న తీరు ఇరిటేటింగ్‌గా ఉందని, తనపై చెయ్యి వేస్తే తాను తొక్కేస్తానని కూడా రమ్య తీవ్రంగా రియాక్ట్ అయింది. ఈ పర్సనల్ కామెంట్లపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.

సోమవారం నాటి ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు మొదట అవకాశం ఇచ్చారు. నిఖిల్ నాయర్, సుమన్ శెట్టి, రాము రాథోడ్‌లను నామినేట్ చేయగా, చివరకు సుమన్ శెట్టి నామినీగా నిలిచాడు. రమ్య, రాము రాథోడ్, రీతూ, పవన్‌లను నామినేట్ చేయగా, చివరికి డీమాన్ పవన్ నామినీగా నిలిచాడు. సంజన, రీతూ, భరణిలను నామినేట్ చేయగా, భరణి కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. లీక్ అయిన సమాచారం ప్రకారం, ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్ల జాబితాలో భరణి, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, రాము రాథోడ్, తనూజ, దివ్య ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు నామినేట్ కావడంతో హౌస్‌లో గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. కొత్త కాంబినేషన్లు, కొత్త వ్యూహాలతో షో రసవత్తరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories