Emanuel: సంజనాతో అనుబంధం పై ఇమ్మాన్యుల్ మనసులోని మాట.. ఇంతకీ ఏమన్నాడంటే ?

Emanuel: సంజనాతో అనుబంధం పై ఇమ్మాన్యుల్ మనసులోని మాట.. ఇంతకీ ఏమన్నాడంటే ?
x

Emanuel: సంజనాతో అనుబంధం పై ఇమ్మాన్యుల్ మనసులోని మాట.. ఇంతకీ ఏమన్నాడంటే ?

Highlights

Emanuel: బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ జర్నీ ముగిసిన తర్వాత ప్రముఖ నటుడు ఇమ్మాన్యుయేల్ తన అనుభవాలను పంచుకున్నారు.

Emanuel: బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ జర్నీ ముగిసిన తర్వాత ప్రముఖ నటుడు ఇమ్మాన్యుయేల్ తన అనుభవాలను పంచుకున్నారు. జబర్దస్త్ ద్వారా కామెడీ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, బిగ్ బాస్ సీజన్‌లో కూడా తన జోవియల్ ప్రవర్తనతో ప్రేక్షకులను అలరించి ఫైనల్ వరకు చేరుకున్నారు.

అది జీవితాంతం గుర్తుంటుంది..

బిగ్ బాస్ హౌస్ తనకి ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని ఇమ్మాన్యుయేల్ పేర్కొన్నారు. హౌస్‌లో తనతో కలిసి పాల్గొన్న ఇతర సభ్యులతో గడిపిన సమయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా సహ కంటెస్టెంట్ సంజనాతో తనకున్న స్నేహం గురించి స్పందిస్తూ.. "ఆమెతో ఏర్పడిన ప్రత్యేక అనుబంధం నా జీవితాంతం కొనసాగుతుంది" అని మనసులో మాట చెప్పారు.

బిగ్ బాస్‌లో ఎవరూ నటించలేరు..

చాలామందికి బిగ్ బాస్ అంటే అక్కడ కంటెస్టెంట్స్ అంతా నటిస్తారనే అభిప్రాయం ఉంటుందని, కానీ అది నిజం కాదని ఇమ్మాన్యుయేల్ స్పష్టం చేశారు. "రోజుల తరబడి, గంటల తరబడి కెమెరాల ముందు ఎవరూ నటించలేరు. అక్కడ ప్రతి ఒక్కరూ తమ సహజత్వాన్ని బయటపెట్టాల్సిందే. అంతకాలం నటించే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు" అని ఆయన వివరించారు.

కృతజ్ఞతలు మరియు భవిష్యత్ ప్రణాళికలు

తన బిగ్ బాస్ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన "విజనరీ వౌస్" సంస్థకు మరియు తనను ఆదరించిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ షో ద్వారా తాను నేర్చుకున్న జీవిత పాఠాలను తన కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో అమలు చేస్తానని వెల్లడించారు.

విజేతగా నిలిచిన కల్యాణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపిన ఇమ్మాన్యుయేల్.. తనకు మొదటి స్థానం రాలేదనే బాధ అస్సలు లేదని, టాప్-4 లో నిలవడమే తనకు దక్కిన పెద్ద గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories