Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌసులో పీక్స్‎కు నామినేషన్ల రచ్చ.. సంజనా, డీమాన్ పవన్ మధ్య మాటల యుద్ధం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌసులో పీక్స్‎కు నామినేషన్ల రచ్చ.. సంజనా, డీమాన్ పవన్ మధ్య మాటల యుద్ధం
x
Highlights

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఇంట్లో దసరా పండగ సందడి ముగిసిందో లేదో 22వ రోజు, 23వ ఎపిసోడ్ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఇంట్లో దసరా పండగ సందడి ముగిసిందో లేదో 22వ రోజు, 23వ ఎపిసోడ్ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వారం ఎపిసోడ్‌లో అనేక ఆసక్తికరమైన సంఘటనలు, గొడవలు, ఉత్కంఠభరితమైన టాస్క్‌లు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ డీమాన్ పవన్ ఇచ్చిన పనిష్మెంట్‌ను హౌస్‌మేట్స్ వ్యతిరేకించడం, ముఖ్యంగా సంజనా చేసిన వాదనలు ప్రధాన చర్చనీయాంశమయ్యాయి. దివ్య వస్తువులు దొంగతనం చేసినందుకు కెప్టెన్ డీమాన్ పవన్ జైలు శిక్ష విధించాలని ప్రయత్నించగా, హౌస్‌మేట్స్ అందుకు అంగీకరించలేదు. ముఖ్యంగా సంజనా తీవ్రంగా వాదించింది. "అతను అమ్మాయిల కేటగిరీ, నేను అమ్మను కదా... అందుకే నాకు, నీకు సపోర్ట్ చేయట్లేదు" అంటూ ఫ్లోరాకు నూరి పోయింది. దీనిపై తనూజ, రీతూ, హరీష్లు సంజనకు ఫ్లోరా బానిసలా మారింది అంటూ చర్చించుకున్నారు. మరోవైపు, ఇమ్మాన్యుయేల్, సంజనా కలిసి డీమాన్‌పై విమర్శలు గుప్పించారు.

సంజన వెల్లుల్లి పోపు కావాలని అడగడంతో దివ్య, డీమాన్ ఒప్పుకోలేదు. ఫుడ్ మానిటర్ అయిన తనూజను పర్మిషన్ అడిగినా వారు నిరాకరించడంతో సంజనా మళ్ళీ తన ఆవేశాన్ని ప్రదర్శించింది. "నా ప్లేస్ కి వచ్చి వాయిస్ రైజ్ చేయొద్దు" అంటూ తనూజ గట్టిగా సమాధానం ఇచ్చింది. దీంతో పర్మిషన్ అడిగినా కూడా తినడానికి భిక్ష అడగాలా అంటూ సంజనా కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ తర్వాత డీమాన్‌పై సంజనా మరింత విరుచుకుపడింది. "బిగ్ బాస్ కంటే ఎక్కువగా ఫీల్ అయ్యి జైలులో వేస్తానని అరుస్తావ్. కానీ పోపు విషయంలో మాత్రం మాట్లాడలేవు. ఎలాంటి కెప్టెన్ నువ్వు? నేను ఫుడ్ తినను" అంటూ నిరాహార దీక్ష మొదలుపెట్టింది. భరణి, డీమాన్, శ్రీజ వంటి వారు సంజనాను శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హరీష్ పక్కలో బల్లెం అంటూనే సంజనాకు మద్దతుగా "మీకు నేనున్నాను, మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడొచ్చు" అంటూ ఓదార్చడానికి ప్రయత్నించాడు. సంజన మాత్రం "బయట ఆ అమ్మాయికి ఫుడ్ పెట్టొద్దు అంటూ కెప్టెన్ అరిచాడు" అంటూ మళ్ళీ రచ్చ కొనసాగించింది. ఇమ్మాన్యుయేల్ మాత్రం బిగ్ బాస్‌ను "అమ్మ టెనెంట్స్‌తోనే తింటుంది. కాబట్టి వాళ్ళకి చికెన్ పంపండి" అని కోరాడు.

కెప్టెన్ డీమాన్ తన కామెంట్స్‌కు బాధపడిన సంజనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సంజన మాత్రం "నేను ఓనర్ని. శ్రీజ, తనూజ, రీతూ అడిగి ఉంటే ఓకే చెప్పేవాడివి. నేను అడిగాను కాబట్టే అలా చేస్తున్నారు" అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఫ్లోరా, సంజనా కలిసి డెమాన్‌పై దాడి చేశాయి. "మీకు అమ్మాయిలే కనిపిస్తారు. కానీ నేను మమ్మీని కాబట్టి కనిపించట్లేదు" అంటూ సంజనా నోరు పారేసుకుంది.

నామినేషన్ల నుండి సేవ్ అవ్వడానికి ఇమ్యూనిటీ స్టార్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో రెండు లెవెల్స్ ఉన్నాయి. మొదటి రౌండ్‌లో సుమన్ - దివ్య టీమ్ మాత్రమే గెలిచింది. కళ్యాణ్ - రీతూ, భరణి - తనూజ, హరీష్ - ఫ్లోరా, శ్రీజ - రాము టీమ్స్ ఫౌల్ చేయడంతో సంచాలక్ డెమాన్ పవన్ వారిని డిస్క్వాలిఫై చేశాడు. మొదటి రౌండ్‌లో గెలిచిన దివ్య, సుమన్.. రెండో లెవెల్‌లో ఆడే వారిని సెలెక్ట్ చేసుకోవాలని ఆదేశించారు. వాళ్ళు ఫ్లోరా, తనూజలను సెలెక్ట్ చేశారు. వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు అనే ఈ ఇండివిడ్యువల్ టాస్క్‌లో ఇతర ఇంటి సభ్యుల సపోర్ట్‌తో తనూజ, సుమన్ శెట్టి ఇమ్యూనిటీని గెలుచుకున్నారు.

4 రోజులైంది స్నానం చేసి... అతని దగ్గరకు వెళ్లాలంటేనే చచ్చాము. అలాగే ఫుడ్ వండాడు అంటూ హరీష్‌ను అసహ్యించుకున్న సంజనా, మళ్ళీ ఇప్పుడు స్వయంగా హరీష్‌ను వండమని అడిగింది. కానీ హరీష్ మాత్రం స్నానం చేసి 10 రోజులు అయ్యింది పర్లేదా? అంటూ కూల్‌గా ఇచ్చి పడేశాడు. పైగా ఒళ్ళంతా స్ప్రే చేసుకున్నాడు. తనూజ, దివ్య, డెమాన్ వండితే తినను అంటూ మళ్ళీ సంజనా రచ్చ మొదలు పెట్టడంతో, ఆ కష్టాలు ఎలా ఉంటాయో తెలియాలి అంటూ ఆమెకే కుకింగ్ మానిటర్ పోస్ట్ ఇచ్చేశారు. నాలుగో వారం నామినేషన్లు కూడా టాస్క్‌తోనే మొదలయ్యాయి. ఇమ్యూనిటీ టాస్క్ తర్వాత కెప్టెన్ పవన్ మినహా మిగిలిన 9 మంది మధ్య నామినేషన్స్ వార్ జరగనుంది. ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories