Biggboss 9 : రణరంగంగా కెప్టెన్సీ టాస్క్.. రమ్యకు గాయం, మాధురి Vs రీతూ మధ్య మాటల యుద్ధం

Biggboss 9 : రణరంగంగా కెప్టెన్సీ టాస్క్.. రమ్యకు గాయం, మాధురి Vs రీతూ మధ్య మాటల యుద్ధం
x

Biggboss 9 : రణరంగంగా కెప్టెన్సీ టాస్క్.. రమ్యకు గాయం, మాధురి Vs రీతూ మధ్య మాటల యుద్ధం

Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ మరింత హై వోల్టేజ్ డ్రామాతో ముందుకు సాగుతోంది.

Biggboss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ మరింత హై వోల్టేజ్ డ్రామాతో ముందుకు సాగుతోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్ నిజంగానే రణరంగంలా మారింది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత గేమ్ మరింత హీటెక్కింది. ఎమోషన్, రొమాన్స్, కామెడీ అన్నీ ఉన్నప్పటికీ, టాస్క్‌లు, నామినేషన్లతో హౌస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో కంటెస్టెంట్‌ల మధ్య పోటీ పతాక స్థాయికి చేరుకుంది. తాజాగా బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్‌లకు వైల్డ్ గోల్ గేమ్ అనే టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో నిర్వహించిన ఈ టాస్క్‌లో ఆటగాళ్లు తమ ముందున్న గోల్‌పోస్ట్‌లో బంతిని వేయాల్సి ఉంటుంది. గేమ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇది పూర్తిగా ఫిజికల్ టాస్క్‌గా మారిపోయింది. ఆటలో భాగంగా భరణిని అడ్డుకునే ప్రయత్నంలో రమ్య కింద పడిపోవడంతో ఆమె తలకు గాయం అయింది. దీంతో ఆమె తాత్కాలికంగా ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ హింసాత్మక ఘటనపై వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, తనూజ కౌంటర్ ఇస్తూ.. వైలెన్స్ మొదలుపెట్టింది మీరే కదా? అంటూ ఘాటుగా స్పందించడంతో హౌస్‌లో వాతావరణం మరింత టెన్షన్‌గా మారింది.

హౌస్‌లో జరుగుతున్న గొడవల్లో దివ్యెల మాధురి, రీతూ చౌదరి మధ్య జరిగిన మాటల యుద్దం హైలైట్‌గా నిలిచింది. నామినేషన్ నుంచి మొదలైన వీరి మధ్య మనస్పర్థలు, ఈ సారి ఏకంగా పెద్ద వాగ్వాదంగా మారింది. రాత్రి లైట్లు ఆరిపోయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఎవరూ మాట్లాడకూడదని, మాట్లాడాలంటే గార్డెన్ ఏరియాకి వెళ్లాలని మాధురి ఒక పెద్ద మహారాణిలా రూల్స్ పాస్ చేసింది. నేను ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడటానికి వచ్చాను అంటూ మాధురి మాట్లాడింది.

మాధురి మాటలపై రీతూ చౌదరి ఘాటుగా స్పందించింది. ఇదేమైనా బిగ్ బాస్ రూలా? అంటూ రీతూ కౌంటర్ వేయడంతో మాధురి రెచ్చిపోయింది. గొడవపడదామనుకుంటున్నారా? అంటూ మాధురి అరిచింది. అరవకండి, మీకేమైనా ప్రాబ్లం ఉందా? అని రీతూ సీరియస్ అవ్వగా, అవును నాకు బీపీ ఉంది, అరుస్తాను అంటూ మాధురి చెప్పింది. వెళ్లి టాబ్లెట్ వేసుకోండి అని రీతూ వెంటనే కౌంటర్ వేయడంతో మాధురికి మరింత కోపం వచ్చింది. ఈ వారం కెప్టెన్సీ అవకాశం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌లకే ఇచ్చిన బిగ్ బాస్, చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ను కాపాడుకోవడం కూడా వారి బాధ్యతే అని ప్రకటించాడు. చివరికి సుమన్, గౌరవ్, నాగార్జున ఇచ్చిన పవర్ ద్వారా నిఖిల్ కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి. హౌస్‌లో గొడవలు పెరుగుతున్నా, ఇమ్మాన్యుయేల్ తన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories