Demon Pavan: డీమాన్ పవన్ ఇంట విషాదం

Demon Pavan: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్న టాప్-3 కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 10 March 2026 2:45 PM IST
Demon Pavan: డీమాన్ పవన్ ఇంట విషాదం
X

Demon Pavan: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్న టాప్-3 కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ తండ్రి మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పవన్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం:

పవన్ తండ్రి గత కొంతకాలంగా నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బిగ్‌బాస్ షోలో ఉన్న సమయంలోనే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పవన్ పలుమార్లు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. తండ్రి కోరిక మేరకే తాను షోలో రాణిస్తున్నానని అప్పట్లో వేదికపై కన్నీటి పర్యంతమయ్యారు. చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించడంతో పవన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

బిగ్‌బాస్ జర్నీలో మేటిగా..

డీమాన్ పవన్ బిగ్‌బాస్ సీజన్ 9లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. రీతూతో సాన్నిహిత్యంపై విమర్శలు వచ్చినప్పటికీ, టాస్కుల విషయంలో పవన్ ఎక్కడా తగ్గలేదు. రెండుసార్లు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించి తన సత్తా చాటారు. ఫినాలే రేసులో ఉండగానే, మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ. 15 లక్షల ప్రైజ్ మనీ సూట్‌కేస్‌ను తీసుకుని తెలివిగా షో నుండి బయటకు వచ్చారు. పవన్ జర్నీ వీడియోలో ఆయనకు లభించిన ఎలివేషన్లు అభిమానులకు ఇప్పటికీ గుర్తే.

పవన్ తండ్రి మృతి పట్ల బిగ్‌బాస్ తోటి కంటెస్టెంట్లు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. "మీ నాన్న భౌతికంగా లేకపోయినా ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడూ తోడుంటాయి" అంటూ పవన్‌కు ధైర్యం చెబుతున్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story