Bigg Boss 9: తిండి లేక అమ్మ మట్టి తినేది: ఇమ్మూ ఎమోషనల్.. కళ్యాణ్‌పై ఫైర్ అయిన కెప్టెన్ తనూజ!

Bigg Boss 9
x

Bigg Boss 9: తిండి లేక అమ్మ మట్టి తినేది: ఇమ్మూ ఎమోషనల్.. కళ్యాణ్‌పై ఫైర్ అయిన కెప్టెన్ తనూజ!

Highlights

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదో వారం ఆఖరికి చేరుకుంది. ఈ వారం జరగాల్సిన ఫ్యామిలీ వీక్ అనుకోకుండా వచ్చేవారానికి వాయిదా పడింది.

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదో వారం ఆఖరికి చేరుకుంది. ఈ వారం జరగాల్సిన ఫ్యామిలీ వీక్ అనుకోకుండా వచ్చేవారానికి వాయిదా పడింది. దీంతో ఈ వారం బీబీ రాజ్యం టాస్క్ ద్వారా తనూజను కెప్టెన్‌గా చేశారు. అంటే వచ్చే ఎమోషనల్ ఫ్యామిలీ వీక్‌కి ఆమె కెప్టెన్‌గా ఉండబోతోందన్నమాట. ఫ్యామిలీ వీక్ ఎలా ఉంటుందో ఒక చిన్న ట్రైలర్‌గా, ఈ వారం హౌస్‌మేట్స్ చిన్ననాటి ఫోటోలు పంపి వారి జ్ఞాపకాలను బిగ్ బాస్ గుర్తు చేశారు.

చిన్ననాటి ఫోటోలు చూస్తూ హౌస్‌మేట్స్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ఇమ్మానుయేల్ తన బాల్యం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తినడానికి తిండి లేక తను కడుపులో ఉన్నప్పుడు తన తల్లి మట్టి తినేదని, తన అన్న (డేనియల్) తన కోసం పడిన కష్టాలు గుర్తు చేసుకుని గుక్కపట్టి ఏడ్చాడు. అలాగే కళ్యాణ్ కూడా చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమవడం, కేవలం 4 ఏళ్లు మాత్రమే వారితో గడిపానని చెబుతూ కన్నీరు మున్నీరయ్యాడు. అయితే, తనూజ తన చెల్లి పెళ్లి గురించి తలచుకుని ఏడుస్తున్నప్పుడు, కళ్యాణ్ సరదాగా "ఏయ్ ఆగు ఆగు, ఏడవడం ఆపు" అనడంతో తనూజ కోపం తెచ్చుకుంది. "నేను ఏడుస్తానా, చస్తానా నీకెందుకు, నన్ను వదిలెయ్" అంటూ కళ్యాణ్‌పై చిరాకు పడింది.

ఈ సీజన్‌లో ఎన్నడూ లేనంతగా పదో వారం నామినేషన్స్ జరిగాయి. కెప్టెన్ ఇమ్మానుయేల్ మినహా హౌస్‌లో ఉన్న మిగతా 10 మంది కంటెస్టెంట్‌లు నామినేషన్స్‌లోకి వచ్చారు. తనూజ, డీమాన్ పవన్, భరణి శంకర్, దివ్య నిఖిత, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, సంజనా గల్రానీ, కళ్యాణ్ పదాల, నిఖిల్ నాయర్, సుమన్ శెట్టి.. ఇలా దాదాపు అందరూ నామినేట్ కావడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉత్కంఠగా మారింది.

తాజాగా అందుతున్న సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం... కళ్యాణ్ పదాల టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, తనూజ రెండో స్థానంలో ఉంది. గతంలో లిస్ట్‌లో ఉన్న రీతూ చౌదరి ఇప్పుడు మూడో స్థానానికి వచ్చింది. ఇక ఓటింగ్ చివరి గంటల్లో డీమాన్ పవన్ (9వ స్థానం), నిఖిల్ నాయర్ (10వ స్థానం) డేంజర్ జోన్‌లో ఉన్నారు. డీమాన్ పవన్‌కు బయట అభిమానుల మద్దతు ఎక్కువగా ఉండడంతో, ఈ వారం నిఖిల్ నాయర్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories