Bigg Boss Telugu 9 : శత్రువుతోనే బ్యాండ్ కట్టించుకున్న కళ్యాణ్.. దివ్యకు షాక్ ఇచ్చిన కొత్త కెప్టెన్

Bigg Boss Telugu 9
x

Bigg Boss Telugu 9 : శత్రువుతోనే బ్యాండ్ కట్టించుకున్న కళ్యాణ్.. దివ్యకు షాక్ ఇచ్చిన కొత్త కెప్టెన్

Highlights

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఐదో వారం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది.

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఐదో వారం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్‌లకు భిన్నంగా, బుర్రకు పదును పెట్టే మెంటల్ గేమ్ ఇచ్చాడు. ఈ ఆటలో పోటీదారుల మధ్య ఉన్న స్నేహాలు, శత్రుత్వాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. తనూజ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని కళ్యాణ్ పడాల తెలివిగా ఆడి చివరికి ఐదో వారం కెప్టెన్‌గా విజయం సాధించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, స్నేహితురాలిని నమ్మించి మోసం చేసిన తనూజ ఆట హౌస్‌మేట్స్‌ను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

బిగ్ బాస్ ఈసారి కెప్టెన్సీ రేసు కోసం కనుక్కోండి చూద్దాం అనే మెంటల్ టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. సేఫ్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లను గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి, కళ్లకు గంతలు కట్టి, వారి నెత్తిపై బల్బు ఉంచుతారు. సంచాలకురాలు సంజన ఎవరో ఒకరిని టచ్ చేసినప్పుడు, వారు కళ్ల గంతలు తీసి మిగిలిన వారిలో ఒకరి లైట్‌ను ఆఫ్ చేయాలి. తర్వాత లైట్ ఆఫ్ అయిన వ్యక్తి, తన లైట్‌ను ఎవరు ఆఫ్ చేశారో కనిపెట్టి కరెక్ట్‌గా చెబితే ఆటలో ఉంటారు, లేదంటే ఎలిమినేట్ అవుతారు.

మొదట సంజన రాముని టచ్ చేయగా, అతను దివ్య లైట్‌ను ఆఫ్ చేశాడు. దివ్య కరెక్ట్‌గా రాము పేరు చెప్పడంతో రాము మొదట్లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత సంజన భరణిని టచ్ చేయగా, భరణి.. కళ్యాణ్ లైట్‌ను ఆఫ్ చేశాడు. కళ్యాణ్ చాలా తెలివిగా ఆలోచించి, భరణి తనను ఎలిమినేట్ చేయాలనుకుంటాడని కరెక్ట్‌గా గెస్ చేసి చెప్పాడు. దీంతో భరణి షాకై ఆట నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కళ్యాణ్ అనాలిసిస్ కరెక్ట్ కావడంతో తను సేఫ్ అయ్యాడు.

తనూజకు అవకాశం రాగానే కళ్యాణ్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం దివ్య లైట్‌ను ఆఫ్ చేసింది. అయితే, దివ్య మాత్రం తనూజపై నమ్మకంతో కళ్యాణ్ పేరును గెస్ చేయగా, అది తప్పు అయింది. దీంతో దివ్య రేసు నుంచి ఎలిమినేట్ అయింది. దీనికి ముందు కెప్టెన్సీ బోర్డులో టాప్-2లో ఉన్న తనూజ-కళ్యాణ్‌లలో ఒకరిని సేఫ్ చేసే అవకాశం బిగ్ బాస్ ఇవ్వగా, కళ్యాణ్-శ్రీజ కలిసి వేసిన బుట్టలో పడి, కళ్యాణ్‌ను సేఫ్ చేసి తనూజ డేంజర్‌లోకి వెళ్లిపోయింది. చివరికి, కెప్టెన్సీ రేసులో మిగిలిన తనూజ-కళ్యాణ్‌లలో ఎవరికి అర్హత లేదో డేంజర్ జోన్ సభ్యులు నిర్ణయించగా, డీమాన్, రీతూ, శ్రీజల సపోర్ట్‌తో కళ్యాణ్ కెప్టెన్‌గా గెలిచాడు.

తనూజ తన స్వార్థం కోసం, అలాగే కళ్యాణ్‌తో ఉన్న పాత ఒప్పందం కారణంగా దివ్యని మోసం చేయడం భరణి, ఇమ్మూ, దివ్యలకు కోపం తెప్పించింది. కళ్యాణ్‌ని గుడ్డిగా నమ్మి, డేంజర్ జోన్‌లో పడ్డ తనూజ, మళ్లీ అతనికే సపోర్ట్ చేయడంతో తనూజ ఆట తీరుపై భరణి, ఇమ్మూలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఇక కెప్టెన్ అయిన తర్వాత, కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన పని చేశాడు. కెప్టెన్ బ్యాండ్‌ను మాజీ కెప్టెన్ రాము కట్టడానికి వస్తే వద్దు అని చెప్పి, తనను గతంలో వరస్ట్ ప్లేయర్ అని చెప్పిన దివ్య చేతే కట్టించుకుని తన ప్రతీకారాన్ని తెలివిగా చూపించాడు. ఆ తర్వాత దివ్య వద్దకు వెళ్లిన తనూజ, నమ్మించి మోసం చేశాను, క్షమించు అంటూ బతిమాలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories