Bigg Boss Telugu 9 : కిచెన్‌లో కొట్టుకున్న మాధురి, తనూజ.. కంటెంట్ కోసం రీతూ-డీమాన్ల చెత్త ట్రాక్!

Bigg Boss Telugu 9 :  కిచెన్‌లో కొట్టుకున్న మాధురి, తనూజ.. కంటెంట్ కోసం రీతూ-డీమాన్ల చెత్త ట్రాక్!
x

Bigg Boss Telugu 9 : కిచెన్‌లో కొట్టుకున్న మాధురి, తనూజ.. కంటెంట్ కోసం రీతూ-డీమాన్ల చెత్త ట్రాక్!

Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లతో రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఈ సీజన్‌లో మాజీ కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి తీసుకురావడం పెద్ద హైలైట్‌గా నిలిచింది.

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లతో రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఈ సీజన్‌లో మాజీ కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి తీసుకురావడం పెద్ద హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఎలిమినేట్ అయిన శ్రీజ, భరణి లకు హౌస్‌లోకి పర్మినెంట్ రీఎంట్రీ కోసం బిగ్ బాస్ ఒక కఠినమైన టాస్క్ ఇచ్చాడు. మరోవైపు, ఈ వారం నామినేషన్ ప్రక్రియలో కూడా మాజీ కంటెస్టెంట్లు వచ్చి ప్రస్తుత సభ్యులను నామినేట్ చేయడం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. తక్కువ ఓటింగ్ శాతంతో ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో, హౌస్‌లో ఏం గొడవలు జరుగుతున్నాయో వివరంగా చూద్దాం.

బిగ్ బాస్ సీజన్ 9లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఎలిమినేట్ అయిన శ్రీజ దమ్ము, భరణి శంకర్ రీఎంట్రీ ఇచ్చారు. అయితే, వీరిద్దరిలో ఎవరో ఒకరే హౌస్‌లో పర్మినెంట్ కంటెస్టెంట్ అవుతారు. దీని కోసం బిగ్ బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చారు. భరణి (బ్లూ టీమ్) తన సపోర్ట్‌గా ఇమ్మాన్యుయల్, నిఖిల్‌ను తీసుకోగా, శ్రీజ (రెడ్ టీమ్) గౌరవ్, డీమాన్ పవన్‌ను ఎంచుకున్నారు. బాక్స్‌లో టవర్ ఎవరిది పెద్దగా ఉంటే ఆ టీమ్ గెలుస్తుంది. మొదటి రౌండ్‌లో శ్రీజ టీమ్ గెలిచింది. సంచాలక్‌లుగా ఉన్న కళ్యాణ్, సుమన్ ఫెయిల్ అవ్వడంతో, మాధురిని కొత్త సంచాలక్‌గా నియమించారు. టవర్ పెద్దగా ఉన్నందుకు మాధురి శ్రీజ టీమ్‌నే విజేతగా ప్రకటించింది.

రెండవ రౌండ్‌లో డీమాన్ పవన్‌ను అడ్డుకునే క్రమంలో భరణి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి గాయపడ్డారు. అంతర్గత పరీక్షల కోసం డాక్టర్ సలహా మేరకు ఆయన మెయిన్ డోర్ గుండా హౌస్ నుంచి తాత్కాలికంగా బయటకు వెళ్లారు. మరుసటి రోజు ఆయన తిరిగి హౌస్‌లోకి వచ్చి రెస్ట్ తీసుకున్నారు. భరణి బయటకు వెళ్లిన సమయంలో హౌస్‌లో చిన్న చిన్న గొడవలు జరిగాయి. కిచెన్‌లో మాధురి, తనూజల మధ్య గొడవ జరిగింది. "నీ నాన్నకు నేను సపోర్ట్ చేయలేదని ఇక్కడ కోపం చూపిస్తున్నావు" అని మాధురి అనడంతో, తనూజ కోప్పడింది. ఆ తర్వాత తనూజ పప్పు ఎక్కువ వేసుకోవడంపై ఇమ్మాన్యుయల్‌ను ప్రశ్నించింది. ఇది విన్న సంజన తినే ప్లేట్ వదిలేసి ఏడుస్తూ వెళ్ళిపోయింది.

రీతూ, డీమాన్ మధ్య గట్టి గట్టిగా అరుచుకోవడం, ఆ వెంటనే ఒకరికొకరు తినిపించుకోవడం అనేది కంటెంట్ కోసం చెత్త ట్రాక్ గా ఆడియన్స్ భావిస్తున్నారు. ఈ ట్రాక్‌పై నెగెటివ్ ట్రోల్స్ వస్తున్నా, బిగ్ బాస్ మాత్రం దీన్ని ప్లే చేస్తూనే ఉన్నాడు. ఈ సీజన్-9లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ చరిత్రలోనే కొత్త ఫార్మాట్‌లో జరిగింది. మాజీ కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి తీసుకువచ్చి, ప్రస్తుత సభ్యులను నామినేట్ చేయించారు. దీని వల్ల హౌస్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వారం ఎలిమినేషన్ రేస్‌లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు: దువ్వాడ మాధురి, రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, సంజనా గల్రాని, తనుజ పుట్టస్వామి, డెమోన్ పవన్, గౌరవ్ గుప్తా, రాము రాథోడ్.

ఓటింగ్ ట్రెండ్ పరిశీలిస్తే.. తనూజ పుట్టస్వామి 33.23% ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. కళ్యాణ్ పడాల 18.69% ఓట్లతో రెండవ స్థానంలో ఉన్నారు. సంజనా గల్రాని 10% ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. డేంజర్ జోన్లో రాము రాథోడ్ (8.35%), గౌరవ్ గుప్తా (7.83%), డెమోన్ పవన్ (7.49%), మధురి దువ్వాడ (7.45%), రీతు చౌదరి (7.44%) తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. ముఖ్యంగా మాధురి, రీతూ మధ్య ఓటింగ్ పోటాపోటీగా ఉంది.

మరో రెండు రోజులు ఓటింగ్‌కు అవకాశం ఉన్నందున, అభిమానులు చివరి వరకు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఓటింగ్ ఫలితాల్లో ఊహించని మార్పులు రావడానికి అవకాశం ఉంది. మొత్తానికి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9, రీఎంట్రీ ట్విస్టులు, కొత్త నామినేషన్ ఫార్మాట్‌తో ప్రేక్షకులను మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories