Biggboss : బిగ్‌బాస్ 9 నామినేషన్స్.. ఇమ్మూ సేఫ్, ఆరుగురికి బురదపోటు.. ఈ వారం ఎవరు అవుట్?

Biggboss : బిగ్‌బాస్ 9 నామినేషన్స్.. ఇమ్మూ సేఫ్, ఆరుగురికి బురదపోటు.. ఈ వారం ఎవరు అవుట్?
x

Biggboss : బిగ్‌బాస్ 9 నామినేషన్స్.. ఇమ్మూ సేఫ్, ఆరుగురికి బురదపోటు.. ఈ వారం ఎవరు అవుట్?

Highlights

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ఆటగాళ్లకు నామినేషన్స్ వచ్చినా, రాకపోయినా కష్టమే. నామినేషన్స్‌కు రాకపోతే తమ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Biggboss : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ఆటగాళ్లకు నామినేషన్స్ వచ్చినా, రాకపోయినా కష్టమే. నామినేషన్స్‌కు రాకపోతే తమ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక నామినేషన్స్‌లో ఉంటే సరైన పర్ఫామెన్స్ లేకపోతే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో, గత వారం డబుల్ ఎలిమినేషన్ (రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్, శ్రీనివాస్ సాయి ఎలిమినేట్) తర్వాత, హౌస్‌లో ప్రస్తుతం 11 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా 10వ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నామినేషన్స్‌లో తొమ్మిది వారాలు సేఫ్ అయిన ఒకే ఒక కంటెస్టెంట్ ఎవరు, ఈ వారం ఏడుగురు సభ్యులు నామినేషన్స్‌లోకి వచ్చారో వివరాలు తెలుసుకుందాం.

తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును ఇమ్మానుయేల్‌ నెలకొల్పారు. ఆయన తొమ్మిది వారాల పాటు నామినేషన్స్ నుంచి తప్పించుకోగలిగిన ఏకైక కంటెస్టెంట్‌గా నిలిచారు. ఇమ్మానుయేల్‌ ఈ 10వ వారంలో కూడా నామినేషన్స్‌కు దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్మానుయేల్‌, భరణిని నామినేట్ చేస్తూ "మీలో ఫైర్ తగ్గిపోతోంది. చాలా విషయాల్లో వెనకడుగు వేస్తున్నారు" అని కారణం చెప్పారు.

ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ ఒక ప్రత్యేకమైన బురద థీమ్ లో నిర్వహించారు. కంటెస్టెంట్స్ తమకు నచ్చని వారిని నామినేట్ చేయడానికి కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. నామినేట్ అయిన హౌస్‌మేట్ షవర్ కింద ఉన్న కుర్చీలో కూర్చోవాల్సి ఉంటుంది, అప్పుడు వారిపై బురద నీరు పడుతుంది. నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం ఆరుగురు సభ్యులు లిస్ట్‌లో చేరారు: భరణి, గౌరవ్, రీతూ, నిఖిల్, సంజన, దివ్య.

నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ తమ కారణాలను బలంగా చెబుతూ వాదోపవాదాలకు దిగారు. రీతూ, దివ్యను నామినేట్ చేస్తూ "నువ్వు ఒక గ్యాంగ్‌ను పెట్టుకుని వారిని బాణాల్లా వదులుతావు" అని ఆరోపించింది. దానికి దివ్య "వాళ్ళేమైనా చిన్న పిల్లలా?" అంటూ కౌంటర్ ఇచ్చింది. గౌరవ్, సంజనను నామినేట్ చేస్తూ "పర్ఫామెన్స్ లేదు కానీ ఎమోషనల్ డ్రామా ఎక్కువైంది" అని కారణం చెప్పాడు. ఈ సీజన్‌లో దివ్యను భరణి నామినేట్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వారం నామినేషన్స్‌లో ముగ్గురు సభ్యులు (గౌరవ్, నిఖిల్, దివ్య) రెండు లేదా అంతకంటే ఎక్కువ నామినేషన్లు పొందారు. ఈ వారం గౌరవ్‌కు అత్యధికంగా ముగ్గురు సభ్యుల నుంచి నామినేషన్లు వచ్చాయి. ఆ తర్వాత దివ్య, నిఖిల్‌కు చెరో రెండు నామినేషన్లు వచ్చాయి. ఈ వారం గౌరవ్, నిఖిల్ ఇద్దరూ వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు కావడం, మిగిలిన నలుగురు కంటెస్టెంట్లకు ఇప్పటికే ఫ్యాన్ బేస్ ఉండటంతో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories