Biggboss 9: కెమెరా వెనుక కన్నీళ్లు, ముందేమో అస్త్రాలు.. హౌస్‌లో ఆధిపత్య పోరు మొదలు!

Biggboss 9: కెమెరా వెనుక కన్నీళ్లు, ముందేమో అస్త్రాలు.. హౌస్‌లో ఆధిపత్య పోరు మొదలు!
x

Biggboss 9: కెమెరా వెనుక కన్నీళ్లు, ముందేమో అస్త్రాలు.. హౌస్‌లో ఆధిపత్య పోరు మొదలు!

Highlights

బిగ్ బాస్ ఇంట్లో తొలి వారం పూర్తి కావడంతో ఆటలో వేడి మొదలైంది. మొదటి ఎలిమినేషన్ తర్వాత, రెండో వారం ప్రారంభం నుంచే కంటెస్టెంట్‌ల మధ్య అస్త్రాలు, శాస్త్రాలు రెండూ బయటకు వచ్చాయి. ఒకవైపు హౌస్‌లో రేషన్ గొడవలు, మరోవైపు ఎమోషన్ల డ్రామా, ఇంకోవైపు కామెడీ పంచులు.. మొత్తంగా బిగ్ బాస్ ఇంటిని ఒక చిన్నపాటి కురుక్షేత్రంలా మార్చేశాయి.

Biggboss 9: బిగ్ బాస్ ఇంట్లో తొలి వారం పూర్తి కావడంతో ఆటలో వేడి మొదలైంది. మొదటి ఎలిమినేషన్ తర్వాత, రెండో వారం ప్రారంభం నుంచే కంటెస్టెంట్‌ల మధ్య అస్త్రాలు, శాస్త్రాలు రెండూ బయటకు వచ్చాయి. ఒకవైపు హౌస్‌లో రేషన్ గొడవలు, మరోవైపు ఎమోషన్ల డ్రామా, ఇంకోవైపు కామెడీ పంచులు.. మొత్తంగా బిగ్ బాస్ ఇంటిని ఒక చిన్నపాటి కురుక్షేత్రంలా మార్చేశాయి.

తొలి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ ఇంట్లో రేషన్ గొడవలు మొదలయ్యాయి. ఎంత ఆహారం ఎవరికి ఇవ్వాలి, పండ్లు ఎలా పంచాలి, ఎవరైనా దొంగిలిస్తారేమోనని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై కంటెస్టెంట్‌ల మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. దీంతో హౌస్‌లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవల్లో ఎవరి పక్షాన మాట్లాడాలో తెలియక హరిత హరీష్ ఒంటరిగా, మౌనంగా కనిపించారు.

ఈ సైలెంట్ చూసి బిగ్ బాస్ స్వయంగా హరితను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచారు. గొడవలు, రెడ్ రోసెస్ ఇష్యూపై హరిత హరీష్ తన బాధను వ్యక్తం చేశారు. బిగ్ బాస్ వేదికపై తనపై వచ్చిన ఆరోపణలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాయని, దాని ప్రభావం తన కుటుంబంపై ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ ఆమెకు ధైర్యం చెప్పి, ఆటలో ఇలాంటివి సహజమని, వాటిని ఎదుర్కోవడమే గెలుపుకు సోపానమని నచ్చజెప్పారు. అంతేకాకుండా, హరిత హరీష్ ను చూసుకునే బాధ్యతను రాముకు అప్పగించారు.

హౌస్‌లో రేషన్ గొడవలు ఒకవైపు ఉంటే, నామినేషన్లు మరింత వేడి పుట్టించాయి. కెప్టెన్ సంజన మినహా అందరూ ఇద్దరిని నామినేట్ చేశారు. తనుజ మొదటగా హరిత హరీష్ ను నామినేట్ చేశారు. గత వారం తన ప్రవర్తనను హరిత హరీష్ అవమానించారని, అలాగే ఫుడ్ విషయంలో కూడా గొడవ పెట్టారని తనుజ ఆరోపించారు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనుజ రెండో నామినేషన్‌గా ఫ్లోరా సైనీని ఎంచుకుని, ఆమె ప్రతి చిన్న విషయానికి ఎందుకు గొడవ పడుతుందని ప్రశ్నించారు. మర్యాద మనీష్ కూడా తనను నామినేట్ చేసినందుకు భరణితో వాదించారు. భరణి డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఇక రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ ఆమె రూల్స్ పాటించడం లేదని, పనులు సరిగ్గా చేయడం లేదని మర్యాద మనీష్ ఆరోపించారు. దీనిపై రీతూ గట్టిగా బదులిచ్చారు.

ఈ నామినేషన్ల ఘట్టంలో ఇమ్మానుయేల్ తన కామెడీతో ఇంటి సభ్యులను నవ్వించారు. రీతూ చౌదరి, డీమాన్ పవన్ కలిసి భోజనం చేస్తుండగా, ఇమ్ము వారికి మధ్యలో వెళ్లి, "రీతూను మిస్ అవుతున్నాను, కానీ పవన్ మధ్యలో వచ్చాడు" అని సరదాగా కామెంట్ చేశారు. ఆ తర్వాత తనుజ కూడా తన నడుం గిల్లిందని సరదాగా చెప్పి ఇంట్లో నవ్వులు పూయించారు.

మొత్తంగా రెండవ వారం మొదటి ఎపిసోడ్ ఫుడ్ గొడవలు, హరిత హరీష్ ఎమోషన్స్, ఇమ్మానుయేల్ కామెడీ, నామినేషన్లలో ఘర్షణలతో ఆసక్తికరంగా సాగింది. ఇక ముందు ముందు ఆట మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories