Bigg Boss 9 : వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో రచ్చ.. ఈ వారం టాప్ కంటెస్టెంట్ ఎలిమినేషన్

Bigg Boss 9
x

Bigg Boss 9 : వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో రచ్చ.. ఈ వారం టాప్ కంటెస్టెంట్ ఎలిమినేషన్

Highlights

Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో ఆరు వారాల మార్క్‌ను దాటి, మరింత ఉత్కంఠగా సాగుతోంది.

Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో ఆరు వారాల మార్క్‌ను దాటి, మరింత ఉత్కంఠగా సాగుతోంది. ఐదో వారంలో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో షోలో కొత్త రచ్చ మొదలైంది. దివ్యెల మాధురి, రమ్య మోక్ష వంటి కొత్త కంటెస్టెంట్లు పాత హౌస్‌మేట్స్ రిలేషన్స్‌పై ఫోకస్ పెట్టి చర్చలకు దారి తీశారు. ఈ నేపథ్యంలో, శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌లోని పరిస్థితులను, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి ఇచ్చిన పవర్స్‌పై సమీక్ష జరిపారు. హౌస్‌మేట్స్, ఆడియెన్స్ అభిప్రాయాల ఆధారంగా నాగ్‌ తన తీర్పును వెలువరించారు. ఈ వారం ఊహించని విధంగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

శనివారం ఎపిసోడ్‌లో, నాగార్జున వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇచ్చిన పవర్స్‌పై సమీక్ష జరిపారు. దివ్యెల మాధురి తన పవర్‌కు అర్హురాలు కాదని నాగార్జున తేల్చారు, దీంతో ఆమె పవర్స్ రద్దు అయ్యాయి. దివ్యెల మాధురి, కళ్యాణ్‌ల మధ్య జరిగిన గొడవపై స్పందిస్తూ, "నువ్వు చెప్పిన విషయం తప్పు కాదు కానీ చెప్పిన విధానం తప్పు" అని మాధురికి సలహా ఇచ్చారు. రమ్య మోక్ష, శ్రీనివాస సాయి, ఆయేషాలకు మాత్రం పవర్స్ కొనసాగించారు. అయితే, రమ్య మోక్ష కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో నాగ్‌ హెచ్చరించారు. నిఖిల్ నాయర్, గౌరవ్‌ల పవర్స్‌ రద్దు చేశారు.

రమ్య, కళ్యాణ్, తనూజల మధ్య తలెత్తిన పుకార్లపై కూడా నాగార్జున చర్చ సాగించారు. తనూజను కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిపించిన నాగార్జున, రమ్య మోక్ష హౌస్‌లో ఇతరులతో చేసిన సంభాషణల వీడియోలను చూపించి ఆమె గాసిప్ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. దీనికి తనూజ షాక్‌కు గురై, ఇకపై క్లారిటీతోనే వ్యవహరిస్తానని హామీ ఇచ్చింది. రమ్య మోక్ష తన ప్రవర్తనతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. బయటకు క్యూట్‌గా కనిపించే రమ్య హౌస్‌లో గాసిప్స్ నడపడం, ఇతరుల రిలేషన్స్‌పై వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆమెపై ఆడియెన్స్ అభిప్రాయం మారిందని చెప్పొచ్చు.

రసవత్తరంగా సాగుతోన్న బిగ్‌బాస్ తెలుగు 9, 6వ వారపు ఎలిమినేషన్ దశకు చేరుకుంది. గత వారం ఫైర్‌స్టామ్ పేరుతో 6 మంది కంటెస్టెంట్లు వైల్డ్‌కార్డ్ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, హౌస్‌లో వాతావరణం పూర్తిగా మారింది. ఈ వారపు నామినేషన్లలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నిలిచారు. వారు తనుజా, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, దివ్య నిఖిత, భరణి శంకర్, రాము రాథోడ్.

సోషల్ మీడియా పోల్స్ అంచనా ప్రకారం, తనుజా 32 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా, సుమన్ శెట్టి 25 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. డీమాన్ పవన్ 15 శాతం, దివ్య నిఖిత 11 శాతం ఓట్లను సంపాదించారు. చివరి రెండు స్థానాల్లో భరణి శంకర్, రాము రాథోడ్ చెరో 10 శాతం ఓట్లు పొందారు. ఈ ఓటింగ్ సరళిని బట్టి భరణి శంకర్, రాము రాథోడ్ ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారని స్పష్టమైంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో బిగ్ బాస్ సీజన్ 9 ఆరోవారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్‌లో భరణి శంకర్ షాకింగ్‌గా అవుట్ అయినట్టు సమాచారం. దీంతో కంటెస్టెంట్లు అందరూ షాక్‌లో పడ్డారు. వాస్తవానికి భరణి శంకర్ బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుండి అందరితో మంచి బాండింగ్స్ క్రియేట్ చేసుకున్నారు. ఎక్కువగా మానవత్వాన్ని ప్రదర్శించడం గేమ్‌లో ప్రభావం చూపింది. తాను ఇతర కంటెస్టెంట్లను టార్గెట్ చేయకుండా బంధాలకు ప్రాధాన్యం ఇచ్చిన కారణంగానే, ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories