Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9లో పెద్ద ట్విస్ట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఆయేషా ఎగ్జిట్.. అదే కారణమా ?

Bigg Boss Telugu 9
x

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9లో పెద్ద ట్విస్ట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఆయేషా ఎగ్జిట్.. అదే కారణమా ?

Highlights

Bigg Boss Telugu 9: డబుల్ హౌస్, డబుల్ ధమాకా కాన్సెప్ట్‌తో రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 47వ రోజు ఊహించని మలుపులతో హౌస్‌లో పెద్ద డ్రామా నడిచింది.

Bigg Boss Telugu 9: డబుల్ హౌస్, డబుల్ ధమాకా కాన్సెప్ట్‌తో రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 47వ రోజు ఊహించని మలుపులతో హౌస్‌లో పెద్ద డ్రామా నడిచింది. ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ఆయేషా ఆరోగ్య సమస్యల కారణంగా షో నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోవడం ప్రేక్షకులకు షాకిచ్చింది. ఈ ఎమోషనల్ ఎగ్జిట్ ఒకవైపు ఉంటే, హౌస్‌లో మరోవైపు రీతూ చౌదరి, మాధురి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇమ్మాన్యుయేల్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

తమిళ బిగ్ బాస్ షో ద్వారా ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆయేషా, తెలుగు బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తన నోటికి పని చెప్పింది. అయితే, హౌస్‌లోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడింది. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచీ ఆయేషా జ్వరం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడింది. వైద్య పరీక్షల్లో ఆమెకు టైఫాయిడ్తో పాటు డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది.

హౌస్‌మేట్స్ ఆరోగ్యం, మెరుగైన చికిత్స కోసం బిగ్ బాస్ సూచన మేరకు ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించారు. వెళ్లే ముందు, తనకు జీవితంలో ఏదీ సులభంగా రాలేదని, బిగ్ బాస్ లాంటి సెకండ్ ఛాన్స్ దక్కడం అదృష్టమని చెబుతూ ఆయేషా కన్నీళ్లు పెట్టుకుంది. తనూజకు జాగ్రత్తలు చెప్పి, ఎమోషనల్‌గా హౌస్‌కు గుడ్‌బై చెప్పింది.

ఆయేషా ఎగ్జిట్‌తో హౌస్‌లో ఒకవైపు భావోద్వేగ వాతావరణం నెలకొంటే, మరోవైపు రీతూ, మాధురి మధ్య వివాదం పతాక స్థాయికి చేరింది. డబ్బుల విషయంలో రీతూ, పవన్ మధ్య మొదలైన చిన్న తగాదా, తరువాత మాధురి వరకు వెళ్లింది. "టీమ్ కోసం కాకుండా నువ్వు పవన్ కోసం డబ్బు వాడావు" అంటూ మాధురి రీతూపై ఘాటుగా ఆరోపించింది.

ఈ ఆరోపణతో రీతూ కన్నీళ్లు పెట్టుకోగా, మాధురి "ఈ హౌస్‌లో పరమ చెత్త కంటెస్టెంట్ నువ్వే" అంటూ విమర్శించింది. దీనికి రీతూ కూడా గట్టిగా సమాధానం చెప్పింది. మాధురి ఇంకో అడుగు ముందుకు వేసి, "నువ్వు గేమ్ ఆడడానికి రాలేదు.. పవన్‌తో ఆడడానికి వచ్చావ్!" అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో హౌస్ వాతావరణం మరింత వేడెక్కింది.

హౌస్‌లో ఉద్రిక్తత మధ్య కెప్టెన్సీ టాస్క్ జరిగింది. దివ్య, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, నిఖిల్, తనూజ,రీతూ ఈ టాస్క్‌లో పోటీపడ్డారు. సర్కిల్ మధ్యలో ఉన్న హ్యాట్‌ను బజర్ మోగగానే పట్టుకోవాల్సిన ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇమ్మాన్యుయేల్ వ్యూహాత్మకంగా ఆడి, ఎక్కువసార్లు హ్యాట్‌ను చేజిక్కించుకుని, చివరికి గేమ్‌ను గెలిచి హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories