Bigg Boss 9 : రాము రాథోడ్ కోసం ఇమ్మాన్యుయెల్ షాకింగ్ నిర్ణయం.. భరణి ఎలిమినేషన్‌తో దివ్య, తనూజ కన్నీళ్లు!

Bigg Boss 9
x

Bigg Boss 9 : రాము రాథోడ్ కోసం ఇమ్మాన్యుయెల్ షాకింగ్ నిర్ణయం.. భరణి ఎలిమినేషన్‌తో దివ్య, తనూజ కన్నీళ్లు!

Highlights

Bigg Boss 9 : బిగ్‌బాస్ సీజన్ 9 దీపావళి ఎపిసోడ్ ఘనంగా జరిగింది. హీరోయిన్స్ శివానీ నాగరం, అప్సర రాణి, ఆనంది తమ స్పెషల్ పర్ఫార్మెన్సులతో ఆకట్టుకున్నారు.

Bigg Boss 9 : బిగ్‌బాస్ సీజన్ 9 దీపావళి ఎపిసోడ్ ఘనంగా జరిగింది. హీరోయిన్స్ శివానీ నాగరం, అప్సర రాణి, ఆనంది తమ స్పెషల్ పర్ఫార్మెన్సులతో ఆకట్టుకున్నారు. అలాగే జటాధార సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్ప శిరోద్కర్ బిగ్‌బాస్ వేదికపై సందడి చేశారు. హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించారు. నాగార్జున కంటెస్టెంట్లను రెండు టీములుగా విడగొట్టి పలు టాస్కులు ఇచ్చారు. గెలిచిన టీమ్‌కు ఆడియన్స్ డిమాండ్ మేరకు కంటెస్టెంట్లకు ఫ్యామిలీ వీడియో కాల్స్ చూపించారు. సుమన్ శెట్టికి అతని భార్య నుంచి, సంజనకు ఆమె భర్త నుంచి వీడియో కాల్ మెసేజ్ వచ్చింది. అయితే, ఈ దీపావళి సంబరాల నడుమ, బిగ్‌బాస్ హౌస్ నుంచి ఊహించని విధంగా ఆరో వారం భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు, ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.

బిగ్‌బాస్ హౌస్‌లో దీపావళి సెలబ్రేషన్స్ ఉత్సాహంగా జరిగాయి. హీరోయిన్స్ శివానీ నాగరం, అప్సర రాణి, ఆనంది డ్యాన్సులతో అలరించగా, సింగర్ సాకేత్ పేరడీ సాంగ్స్‌తో ఎంటర్‌టైన్ చేశారు. జటాధార సినిమా ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా బిగ్‌బాస్‌కి వచ్చారు. ఈ క్రమంలో సంజన, సుమన్ శెట్టి, డీమాన్ పవన్‌లకు ఇంటి నుంచి వీడియో మెసేజ్‌లు వచ్చాయి. ముఖ్యంగా తన పిల్లలను, భర్తను చూసి సంజన ఎమోషనల్ అయ్యింది. పండగ సందర్భంగా నాగార్జున హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు గిఫ్ట్‌గా అందించారు. స్వీట్ ఫైట్ టాస్క్‌లో సుమన్ శెట్టి టీం గెలిచింది.

నామినేషన్లలో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరినీ సేవ్ చేయగా, చివరికి రాము రాథోడ్, భరణి మిగిలిపోయారు. అప్పటి నుంచి దివ్య, తనూజ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారు. తనూజ ఏడుపు చూసి నాగార్జున ఆమెను కన్ఫెషన్ రూంకు పిలిచి అడిగారు. "ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నా, వాళ్ళ వాయిస్ వినలేకపోయాను. ఇంట్లో నాన్న అనే బాండింగ్ భరణిగారితో ఏర్పడింది. కానీ అందరూ దాని గురించి చెప్పి నా గేమ్ స్పాయిల్ అవుతుందని చెప్పడంతో ఆయనతో వారం రోజులుగా సరిగ్గా మాట్లాడలేకపోయా. అందరూ ఉన్న ఒంటరిని అనే ఫీలింగ్ కలుగుతుంది" అంటూ తనూజ ఏడ్చేసింది.

రాము, భరణి ఇద్దరిని గార్డెన్ ఏరియాకు రమ్మని చెప్పిన నాగ్, దీపావళి అయినా ఎలిమినేషన్ తప్పదని అన్నారు. హౌస్‌లో ఇమ్మాన్యుయెల్ దగ్గర ఉన్న పవరాస్త్రకు మూడు పవర్స్ ఉన్నాయని, ఈ వారం సేవింగ్ పవర్ ఉందని చెప్పారు. ఇమ్మాన్యుయెల్ మాట్లాడుతూ, "ఆరు వారాలుగా రాము స్ట్రైట్ ఫార్వాడ్‌గా ఉన్నాడు, కానీ మొదట 2 వారాల్లో కనిపించిన భరణి అన్న మళ్ళీ కనిపించలేదు. బాండ్స్‌లో ఇరుక్కుపోయినట్లు అనిపించింది. అందుకే ఇది రాము కోసం ఉపయోగిస్తున్నా" అని చెప్పాడు. ఇమ్మాన్యుయెల్ నిర్ణయం అందరినీ షాక్ కు గురిచేసింది. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు లీస్ట్‌లో ఉన్నారో చూడగా, భరణి, రాము ఎదురుగా ఉన్న క్రాకర్స్ వెలిగించాలని నాగ్ చెప్పాడు. రాము సైడ్ ఉన్న క్రాకర్ గ్రీన్ కలర్ రాగా, భరణి సైడ్ రెడ్ కలర్ వచ్చింది. దీంతో భరణి ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. డోర్ ఓపెన్ కాగానే, దివ్య, తనూజలు వెళ్లి భరణిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చారు.

ఆరు వారాలు హౌస్‌లో ఉన్న భరణికి బిగ్‌బాస్ నిర్వాహకులు రోజుకు యాభై వేల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారని సమాచారం. ఇది హౌస్‌లో అత్యధిక పారితోషికం. ఈ లెక్కన అతను వారానికి రూ. 3.50 లక్షలు, ఆరు వారాలకు మొత్తంగా రూ. 21 లక్షల పారితోషికం అందుకున్నాడని చెప్పొచ్చు. ఇది దాదాపు విన్నర్ రేంజ్ పారితోషికం కావడం విశేషం. ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ బజ్ లో శివాజీతో మాట్లాడిన భరణి, తన బాండింగ్ తన గేమ్ పై ప్రభావం చూపించలేదని, గేమ్ విషయంలో తనకు క్లారిటీ ఉందని చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories