Bigg Boss 9: టాప్-5 రేసులో కొత్త ట్విస్ట్.. టికెట్ టు ఫినాలే కోసం హోరాహోరీ పోరు

Bigg Boss 9:  టాప్-5 రేసులో కొత్త ట్విస్ట్.. టికెట్ టు ఫినాలే కోసం హోరాహోరీ పోరు
x

 Bigg Boss 9: టాప్-5 రేసులో కొత్త ట్విస్ట్.. టికెట్ టు ఫినాలే కోసం హోరాహోరీ పోరు

Highlights

సెప్టెంబరులో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకొని, 13వ వారం కూడా దాదాపు ముగింపుకు వచ్చింది.

Bigg Boss 9: సెప్టెంబరులో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకొని, 13వ వారం కూడా దాదాపు ముగింపుకు వచ్చింది. మరో కొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉండటంతో ఈసారి విన్నర్ ఎవరు, టాప్-5లో ఎవరు నిలబడతారు అనే దానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా, విజేత ఎవరో తెలుసుకోవాలనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.

13వ వారం ఎలిమినేషన్స్‌కు ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వారిలో తనూజ, భరణి, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, సంజనా ఉన్నారు. ఇమ్మాన్యుయెల్‌, కళ్యాణ్‌ ఈ వారం సేఫ్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే ఓటింగ్‌లో తనూజ టాప్‌లో ఉండగా, రీతూ చౌదరి రెండో స్థానంలో ఉంది. సంజనా గల్రానీ మూడో ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం సుమన్ శెట్టి ఆరో స్థానంలో అంటే ఆఖరి స్థానంలో కొనసాగుతున్నాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఈ వారం సుమన్ ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో నడుస్తున్న అంచనాల ప్రకారం, కల్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన, డీమాన్ పవన్ టాప్-5లో ఉండనున్నారు. గత వారం ఎపిసోడ్ తర్వాత సంజనా గల్రానీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. దీంతో ఆమె టాప్-5లో గ్యారెంటీగా ఉంటుందని, అంతేకాకుండా టాప్-3 రేసులో చివరికి టైటిల్ రేసులో నిలబడినా ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు.

టికెట్ టు ఫినాలే రేసులో భాగంగా 86వ రోజు రాత్రి బిగ్ బాస్బ్యారెల్ బ్యాలెన్స్ బ్యాటిల్ టాస్క్ ఇచ్చారు ఇద్దరు పోటీదారులు (తనూజ, సుమన్) బ్యారెల్ కింద నిలబడి బ్యాలెన్స్ చేయాలి. సంచాలక్ పిలిచినప్పుడు, మిగతా కంటెస్టెంట్లు తాము ఫైనలిస్ట్‌గా చూడకూడదనుకున్నవారి బ్యారెల్‌లో నీళ్లు నింపాలి. హౌస్‌మేట్స్ ఎక్కువ మంది తనూజకే సపోర్ట్ చేసినా, చివరకు సుమన్ శెట్టి ఈ టాస్క్‌లో విజయం సాధించాడు. ఓడిపోయినందుకు తనూజ కన్నీళ్లు పెట్టుకుంది.

సుమన్ గెలిచిన తర్వాత, తనకు సపోర్ట్ చేసిన భరణితో కలిసి ఆడాలని డీల్ కుదుర్చుకున్నాడు. 87వ రోజు ఉదయం పవర్ బాక్స్ ఛాలెంజ్ జరిగింది. ఇందులో సుమన్, కల్యాణ్, డీమాన్ పవన్ ముగ్గురూ పోటీపడ్డారు. ఈ ఫైట్‌లో సుమన్, డీమాన్ పవన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి డీమాన్ పవన్ గెలిచాడు. ఆ తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్‌ను ఎన్నుకోవడానికి వారధి కట్టు విజయం పట్టు అనే టాస్క్ ఇచ్చారు. ఈ పోరులో చివరకు భరణి శంకర్ విన్ అయ్యాడు. ఈ టాస్క్‌కు తనూజా సంచాలక్‌గా వ్యవహరించింది. టాస్క్‌లో పవన్ ఓడిపోవడానికి అతడి ప్లాంక్‌తో సమస్యే కారణం. ఓటమి తర్వాత, పవన్ దగ్గరున్న అన్ని గడులను భరణి స్వాధీనం చేసుకున్నాడు, పవన్ రేసు నుంచి తప్పుకున్నాడు. తనను టార్గెట్ చేసినవాళ్లనే తాను టార్గెట్ చేయాలని అనుకున్నానని తనూజ తన చర్యను సమర్థించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories