
Bigg Boss 9 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రతి వారం కొత్త మలుపు తిరుగుతోంది. ఐదో వారం వరకు బిగ్‌బాస్ హౌస్‌లో కామన్ మ్యాన్, సెలబ్రిటీ కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం సాగేది.
Bigg Boss 9 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రతి వారం కొత్త మలుపు తిరుగుతోంది. ఐదో వారం వరకు బిగ్‌బాస్ హౌస్‌లో కామన్ మ్యాన్, సెలబ్రిటీ కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం సాగేది. కానీ, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో షో స్వరూపమే మారిపోయింది. ప్రస్తుతం ట్రయాంగిల్ స్టోరీలాగా కామన్ మ్యాన్స్, సెలబ్రిటీస్, వైల్డ్‌కార్డ్‌ల మధ్య గేమ్ నడుస్తోంది. ఇప్పటివరకు చదరంగంలా సాగిన షో ఇప్పుడు రణరంగంగా మారిపోయింది. ఈ వారం ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారు? హౌస్‌లో ఏం జరిగింది? అనే పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
గత ఆరు వారాలుగా బిగ్‌బాస్ 9 వివాదాలు, సంచలనాలు, షాకింగ్ సన్నివేశాలతో ముందుకు సాగింది. ఇప్పటివరకు శ్రష్టివర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఆశా సైనీ, శ్రీజ దమ్ము, భరణి శంకర్ తో సహా మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. 5వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినప్పటి నుండి ఇంట్లో ఆట మరింత ఉత్కంఠతో సాగుతోంది.
వైల్డ్‌కార్డ్ ఎంట్రీల ముందే కంటెస్టెంట్లు తగ్గదేలే అన్నట్లుగా ఉంటే.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో ప్రతి కంటెస్టెంట్ అసలు తగ్గదేలే అన్నట్లుగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయేషా, మాధురి, దివ్య నిఖిత, రీతు చౌదరి వంటి కంటెస్టెంట్లు ఇది చదరంగం కాకుండా రణరంగం అని నిరూపిస్తున్నారు.
7వ వారం నామినేషన్స్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ వారం నామినేషన్ హక్కును కూడా పోరాడి గెలవాల్సిందిగా బిగ్‌బాస్ ప్రకటించారు. నామినేషన్ ప్రక్రియలో ముఖ్యంగా అయేషా, ఇమాన్యుల్ కీలక పాత్ర పోషించారు. టాస్క్ రూపంలో అయేషా ఇమాన్యుల్‌కు నామినేషన్ పవర్స్ ఇచ్చారు. బిగ్‌బాస్ హాల్‌లో వేలాది బెలూన్స్ ఉంచి వాటిలో నామినేషన్ టికెట్స్ దాగి ఉన్నాయని, ఈ టికెట్లు పొందినవారు నామినేషన్ వివిధ పవర్స్ పొందగలరని బిగ్‌బాస్ ప్రకటించారు.
ఇక సైరన్ శబ్దంతో అయేషా, ఇమాన్యుల్ రెచ్చిపోయారు. వేలాది బెలూన్స్ పగలగొట్టి, వాటిలోని నామినేషన్ టికెట్లను సంపాదించుకున్నారు. అయేషాకు రెండు నామినేషన్ కార్డ్స్, ఒక డైరెక్ట్ నామినేషన్ కార్డ్ లభించగా, ఇమాన్యుల్‌కు కూడా 3 నామినేషన్ కార్డ్స్ దొరికాయి. వీటిలోని పవర్ కార్డ్స్‌ను ఇతర సభ్యులతో పంచుకోవచ్చు అని బిగ్‌బాస్ పేర్కొన్నారు. ఇమాన్యుల్ తన కార్డ్స్‌ను కళ్యాణ్, దివ్య నిఖిత, రీతు చౌదరితో పంచుకున్నాడు. అదే విధంగా అయేషా తన కార్డ్స్‌ను సంజన , గౌరవ్, తనుజతో పంచుకుంది. టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనంతరం, నామినేషన్ కంటెస్టెంట్లు సెలెక్ట్ చేసుకుని వారి ముఖంపై ఫోమ్ రుద్ది, నామినేషన్ కారణాలను వెల్లడించారు.
నామినేషన్ ప్రక్రియలో ఆయేషా రీతు చౌదరిని టార్గెట్ చేసింది. రీతు ముఖానికి ఫోమ్ రుద్దింది. అయేషా తన కారణాలను చెబుతుంటే.. ఆ ఫోమ్ తుడుచుకోవడానికి ఒక నిమిషం ఆగు అని రీతూ అడ్డుకుంది. అప్పుడే చర్చ జరుగుతుందని చెప్పింది. రీతు కూడా తన అభిప్రాయాన్ని బలంగా తెలియజేసింది. అయేషా "నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు వచ్చింది లవ్ కార్డ్ వెతుక్కోవడం కోసమే కదా" అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది. దీంతో రీతు కోపం కట్టలు తెంచుకుంది. "నీకు అనిపించింది తప్పు కాదు, ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం సరికాదు. నువ్వు చూసినది కరెక్ట్ కాదు" అని చెప్పింది. అయేషా కాస్త ఓవర్ చేస్తూ.. 'రీతు ఎందుకు నీకు అంత ఆటిట్యూడ్?" అని ప్రశ్నించింది. ఇలా అయేషా-రీతు మధ్య నామినేషన్ రణరంగం హౌస్‌లో ఉత్కంఠను సృష్టించింది.
మరోవైపు, రాము రాథోడ్ కూడా రీతూపై రెచ్చిపోయాడు. రీతూ తన నామినేషన్ పవర్ ఉపయోగించి రాము రాథోడ్‌ను నామినేట్ చేస్తూ "అసలు నువ్వు ఆటలో కనిపించడం లేదు" అని చెప్పింది. దీంతో రాము "అయితే కళ్ళు చెక్ చేయించుకో రీతూ" అంటూ తీవ్రంగా స్పందించాడు. రీతూ కూడా తగ్గకుండా.."నాకు ఎవరూ లేరు, నేను ఒక్కడినేనని సింపతీ గేమ్ ఆడుతున్నావు" అంటూ వాదించింది. దీనికి రాము "నేను అలా ఎప్పుడు అన్నానో ప్రూఫ్ చూయించు" అని ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు.
తనూజ , రమ్య మోక్ష మధ్య కూడా తీవ్ర వాదన జరిగింది. రమ్య మోక్ష తనూజను "నువ్వు డ్రామా క్వీన్, నటిస్తున్నావు, ఫేక్" అంటూ నామినేట్ చేసింది. దీంతో తనూజ "డ్రామా క్వీన్ అనుకుంటావో.. సూపర్ క్వీన్ అనుకుంటావో నీ ఇష్టం.. నేనింతే.. ఇదే నా ఆట" అంటూ గట్టిగా బదులిచ్చింది. రమ్యకి వార్నింగ్ ఇస్తూ, "ఒకరిని హర్ట్ చేయాలని, ఇంకొకరికి మంట పెట్టాలని వచ్చావా?" అని అడిగింది. రమ్య "నీలాగా ఒకరు వెళ్లిపోతే ఇంకొకరితో బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదు" అంటూ కౌంటర్ ఇచ్చింది. "రెండు చేతులు కలిస్తేనే వచ్చే చప్పట్ల సౌండ్ కన్నా.. ఒక్క చేతితో వేసే విజిల్ సౌండ్ గట్టిగా వస్తుంది" అంటూ గట్టిగా విజిల్ వేసి ఇంటి సభ్యులను షాక్ చేసింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లో 7వ వారం నామినేషన్ ప్రక్రియలో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో గోల్కొండ ఫేమ్ శీను, దివ్య నిఖిత, మోక్ష రమ్య, సంజన, తనూజ , రాము రాథోడ్ , కళ్యాణ్, రీతు చౌదరి నామినేట్ అయ్యారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire