Biggboss: బిగ్ బాస్ 9వ వారం నామినేషన్స్ ఫైట్..రీతూ వర్సెస్ సంజన.. కన్నీళ్లు పెట్టుకున్న సుమన్ శెట్టి

Biggboss: బిగ్ బాస్ 9వ వారం నామినేషన్స్ ఫైట్..రీతూ వర్సెస్ సంజన.. కన్నీళ్లు పెట్టుకున్న సుమన్ శెట్టి
x

Biggboss: బిగ్ బాస్ 9వ వారం నామినేషన్స్ ఫైట్..రీతూ వర్సెస్ సంజన.. కన్నీళ్లు పెట్టుకున్న సుమన్ శెట్టి 

Highlights

Biggboss: బిగ్ బాస్ హౌస్ నుంచి క్రేజీ మాధురి ఎలిమినేట్ అయిన తర్వాత, 9వ వారం నామినేషన్స్ హీట్ మొదలైంది.

Biggboss: బిగ్ బాస్ హౌస్ నుంచి క్రేజీ మాధురి ఎలిమినేట్ అయిన తర్వాత, 9వ వారం నామినేషన్స్ హీట్ మొదలైంది. ప్రస్తుతం హౌస్‌లో 12 మంది కంటెస్టెంట్లు ఉండగా, ఈ వారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్ టాయ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఒకరి బొమ్మ తీసుకుని సేఫ్ జోన్‌కు చేరాలి. లేటైన వారు, ఎవరి బొమ్మ అయితే లేటుగా ఉంటుందో ఆ ఇద్దరూ నామినేషన్స్ జోన్‌కు వెళ్లాలి అనేది బిగ్ బాస్ ప్లాన్. ఈ నామినేషన్స్ ప్రక్రియలో రీతూ-సంజన మధ్య డీమాన్ పవన్ సపోర్ట్ గురించి పెద్ద వాగ్వాదం జరిగింది. ఇక సుమన్ శెట్టి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోగా, తనుజ తన మహానటి సావిత్రి డైలాగులతో మరింత హైలైట్ అయింది. ఈ వారం నామినేషన్స్ ప్రోమో హైలైట్స్ మీద ఓ లుక్కేద్దాం.

టాయ్ టాస్క్ ప్రారంభం కాగానే సంజన ఆలస్యంగా వచ్చి రీతూ బొమ్మను తీసుకుని నామినేషన్ జోన్‌కు వెళ్లడంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రీతూను నామినేట్ చేయడానికి సంజన మొదటి నుంచి చెబుతున్న పాయింట్ డీమాన్ పవన్ సపోర్ట్. ఈ వారం నామినేషన్స్‌లో కూడా సంజన అదే పాయింట్‌ను లేవనెత్తింది. "హౌస్‌లో అందరికీ బాండింగ్ ఉన్నట్టే, నాకు కూడా ఒకరితో బాండింగ్ ఉంది. అది తప్పని మీకు అనిపిస్తే నేను ఏమీ చేయలేను" అని రీతూ గట్టిగా బదులిచ్చింది. "నీ వల్లే డీమాన్ పవన్ బయటికి వచ్చాడు" అని సంజన ఆరోపించగా, "నేను వ్యక్తిగతంగా ఎవరినీ దాడి చేయలేదు" అని రీతూ సీరియస్‌గా కౌంటర్ ఇచ్చింది.

వీకెండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా నామినేషన్స్ వచ్చినప్పుడల్లా మహానటి సావిత్రి గెటప్‌లో కనిపించే తనూజ ఈసారి కూడా చీర కట్టుకుని వచ్చింది. తనూజ, సుమన్ మధ్య నామినేషన్ రౌండ్ జరగగా "నేను ఫేక్ కాదు, మాస్క్ వేసుకుని సేఫ్ గేమ్ ఆడటం లేదు. పాయింట్స్ వచ్చినప్పుడు వాయిస్ లేవనెత్తుతాను. అవసరం ఉన్నచోట ఇన్‌వాల్వ్ అవుతాను" అంటూ తనూజ తనను తాను గట్టిగా సమర్థించుకుంది. "భరణిని నామినేట్ చేయడానికి పాయింట్ లేదని తనూజ చెప్పినప్పుడు మరి అతనికి ఏమైనా ట్రోఫీ ఇస్తారా?' అని సంజన కౌంటర్ వేయడం ప్రోమోలో హైలైట్ అయింది.

టాయ్ టాస్క్ లో ఆలస్యంగా రావడం, సరిగ్గా పరిగెత్తలేకపోవడం వంటి కారణాల వల్ల సుమన్ శెట్టి భావోద్వేగానికి లోనయ్యారు. "నా వల్ల అందరికీ సమస్య అవుతుంది అంటున్నారు కాబట్టి నేను సరిగా పరిగెత్తలేకపోయాను కాబట్టి.. నన్నే నామినేట్ చేయండి" అంటూ సుమన్ శెట్టి కన్నీటిపర్యంతమయ్యారు. రీతూ అతన్ని ఓదార్చింది. ఈ ఎమోషనల్ సీన్ ప్రోమోలో హైలైట్ అయింది. ప్రోమో హైలైట్స్ ప్రకారం, ఈ వారం కూడా ఇమ్ము నామినేషన్స్‌లో లేనట్లు తెలుస్తోంది. నామినేషన్స్ జోన్‌లో ఏ కంటెస్టెంట్లు ఉంటారు. ఏ పాయింట్లపై ఫైట్స్ జరిగాయో పూర్తి ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories