Dhurandhar: బాక్సాఫీస్ 'ధురంధర్': 1200 కోట్లతో రణవీర్ సింగ్ సరికొత్త రికార్డు!

Dhurandhar
x

Dhurandhar: బాక్సాఫీస్ 'ధురంధర్': 1200 కోట్లతో రణవీర్ సింగ్ సరికొత్త రికార్డు!

Highlights

Dhurandhar: రణవీర్ సింగ్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా ‘ధురంధర్’ నిలిచింది.

Dhurandhar: రణవీర్ సింగ్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా ‘ధురంధర్’ నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ అద్భుతమైన కథాంశంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది.

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నాల ఇంటెన్స్ నటన, హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసే విధంగా రూపొందిన కథనం సినిమా విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 2025లో బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో బాలీవుడ్ సత్తా మరోసారి గ్లోబల్ స్థాయిలో నిరూపితమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories