అక్టోబర్ బాక్సాఫీస్ హిస్టరీ.. దసరాకి ఒకటి, దీపావళికి రెండు హిట్లు..విమర్శకుల ప్రశంసలు అందుకున్న అరి

అక్టోబర్ బాక్సాఫీస్ హిస్టరీ.. దసరాకి ఒకటి, దీపావళికి రెండు హిట్లు..విమర్శకుల ప్రశంసలు అందుకున్న అరి
x

అక్టోబర్ బాక్సాఫీస్ హిస్టరీ.. దసరాకి ఒకటి, దీపావళికి రెండు హిట్లు..విమర్శకుల ప్రశంసలు అందుకున్న అరి

Highlights

Box Office: అక్టోబర్ నెలలో కూడా బాక్సాఫీస్ కళకళలాడింది. విడుదలైన సినిమాల సంఖ్య తక్కువే అయినా, మూడు సినిమాలు పెద్ద విజయాలుగా నిలవడం సినీ వర్గాలను ఉత్సాహపరిచింది.

సినిమా ఇండస్ట్రీకి పండుగ సీజన్ ఎప్పుడూ ఒక వరంలాంటిది. అందుకే నిర్మాతలు, హీరోలు తమ సినిమాలను పండుగ రోజుల్లో విడుదల చేయడానికి అత్యంత ఆసక్తి చూపిస్తారు. అక్టోబర్ నెలలో కూడా బాక్సాఫీస్ కళకళలాడింది. విడుదలైన సినిమాల సంఖ్య తక్కువే అయినా, మూడు సినిమాలు పెద్ద విజయాలుగా నిలవడం సినీ వర్గాలను ఉత్సాహపరిచింది. ముఖ్యంగా దసరాకు వచ్చిన ఒక బ్లాక్‌బస్టర్ సినిమా, దీపావళికి వచ్చిన మరో రెండు సక్సెస్ సినిమాలు అక్టోబర్ బాక్సాఫీస్‌కు జోష్ తెచ్చాయి. ఈ పండుగ రేసులో కమర్షియల్‌గా కొన్ని సినిమాలు నిలబడలేకపోయినా అరి వంటి విభిన్న కాన్సెప్ట్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకుని, తమ ప్రత్యేకతను చాటుకున్నాయి.

అక్టోబర్ నెలలో పండుగ సినిమాల జోరు దసరా నుంచే మొదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన రిషబ్ శెట్టి సినిమా కాంతార చాప్టర్-1 అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాపై మొదట్లో మిశ్రమ టాక్ వినిపించినా, సెకెండాఫ్ పూర్తిగా క్లిక్ అవ్వడంతో దీనికి ఎదురు లేకుండా పోయింది. ఒకానొక దశలో పెద్ద సినిమాల కోసం కేటాయించిన స్క్రీన్లను కూడా కాంతార దక్కించుకుంది. ఈ ఏడాది రూ. 850 కోట్లకు పైగా వసూళ్లతో ఇది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ధనుష్ నటించిన డబ్బింగ్ సినిమా ఇడ్లీ కొట్టు మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

పండుగ ఉత్సాహం తొలి వారం ముగిసిన తర్వాత, రెండో వారంలో బాక్సాఫీస్ కాస్త నెమ్మదించింది. ఈ సమయంలో విడుదలైన అరి సినిమా విభిన్న కాన్సెప్ట్‌తో ప్రశంసలు అందుకుంది. అరి సినిమాకు థియేటర్ల వద్ద పెద్దగా కలెక్షన్లు లేకపోయినా, కాన్సెప్ట్ పరంగా విమర్శకులు, కొద్దిమంది ప్రేక్షకుల నుంచి అద్భుతమైన మెప్పు లభించింది. దర్శకుడు ఎంచుకున్న కథాంశం, దానిని తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా, ట్రెండీగా ఉండటం విశేషం. ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధించింది. కమర్షియల్‌గా నిలబడలేకపోయినా, కొత్త తరహా ప్రయత్నాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అరి గుర్తుచేసింది. ఈ వారంలో విడుదలైన శశివదనే, కానిస్టేబుల్ సినిమాలు మాత్రం చర్చకు కూడా నోచుకోలేకపోయాయి.

మూడో వారం నుంచి దీపావళి పండుగ సందర్భంగా నాలుగు సినిమాలు పోటీపడ్డాయి. వీటిలో రెండు చిత్రాలు విజేతలుగా నిలిచాయి. ప్రదీప్ రంగనాథన్ నటించిన డూడ్ సినిమా కోసం కుర్రకారు ఎక్కువగా ఎదురుచూశారు. మిత్రమండలి కంటే డూడ్‌కే మొదటి రోజు, మొదటి వారాంతంలో మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగులో ఒక స్ట్రెయిట్ హీరో స్థాయిలో ఈ డబ్బింగ్ సినిమా రూ. 100 కోట్ల వసూళ్లతో విజయం సాధించింది. కిరణ్ అబ్బవరం నటించిన కె-ర్యాంప్ మూవీ మొదటి రోజు మిశ్రమ టాక్‌ను అందుకున్నా, రెండో రోజు నుంచి ఊహించని విధంగా పుంజుకుంది. కిరణ్ అబ్బవరం చేసిన ప్రమోషన్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఈ సినిమా దీపావళి విన్నర్‌గా నిలిచింది.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన తెలుసు కదా సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. కాన్సెప్ట్ క్లారిటీతో మొదలైనా, కన్ఫ్యూజన్‌తో ముగియడంతో, ఈమధ్య కాలంలో సిద్ధు నుంచి వచ్చిన వీక్‌ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత వారం వచ్చిన బైసన్, ధర్మవరం వంటి సినిమాలు బాక్సాఫీస్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఎక్కువ కాలం పాటు కె-ర్యాంప్, డూడ్ సినిమాల హవానే కొనసాగింది. రష్మిక నటించిన థామా కూడా తెలుగులో మూడు రోజులకే పరిమితమైంది.

ఓవరాల్‌గా అక్టోబర్‌లో దసరాకు వచ్చిన కాంతార చాప్టర్-1, దీపావళికి వచ్చిన డూడ్, కె-ర్యాంప్ సినిమాలు విజయవంతమయ్యాయి. వీటితో పాటు, అరి వంటి విభిన్న చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ద్వారా అక్టోబర్ బాక్సాఫీస్ జోష్‌ను కొనసాగించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories