OTT: ఓటీటీలోకి బ్రహ్మా ఆనందం.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే

OTT: ఓటీటీలోకి బ్రహ్మా ఆనందం.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే
x

OTT: ఓటీటీలోకి బ్రహ్మా ఆనందం.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే

Highlights

OTT: హస్య బ్రహ్మ.. బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్ కలిసి నటించిన తాజా చిత్రం బ్రహ్మాఆనందం.

OTT: హస్య బ్రహ్మ.. బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్ కలిసి నటించిన తాజా చిత్రం బ్రహ్మాఆనందం. ఈ సినిమాలో వీరిద్దరు తాత-మనవళ్లుగా కనిపించారు. ఈ చిత్రానికి ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కించారు. కాగా ఈ చిత్రాన్ని గతనెల ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందకు తీసుకొచ్చారు. అయితే మంచి సినిమాగా పేరు సంపాదించుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది.

బ్రహ్మానందం కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఎమోషనల్‌ సీన్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. మార్చి 20వ తేదీ నుంచి ఈ సినిమా ఆహా‌లో ప్రసారమవుతుంది. అయితే, ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు ప్రత్యేక ఆఫర్‌గా, మార్చి 19 నుంచే వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.

ఈ సినిమా కథేంటంటే.?

బ్రహ్మ అలియాస్ రాజా గౌతమ్, ఒక థియేటర్ ఆర్టిస్ట్. మంచి నటుడిగా గుర్తింపు పొందాలన్నది అతని కల. ఈ క్రమంలో దిల్లీలో జరగనున్న కళారంగ్ మహోత్సవంలో నాటకం వేయడానికి అవకాశం వస్తుంది. అయితే అందులో పాల్గొనాలంటే రూ. 6 లక్షలు కావాలని నిర్వాహకుడు చెప్తాడు. ఇలాంటి పరిస్థితిలో అతని తాత, మూర్తి అలియాస్ ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం), తన పేరు మీద కోదాడ దగ్గర ఆరెకరాల భూమి ఉందని చెబుతాడు.

తను చెప్పినట్లు చేస్తే ఆ భూమిని బ్రహ్మకు రాసిచ్చేస్తానని అంటాడు. దీంతో బ్రహ్మ, తాతతో కలిసి ఊరికి వెళతాడు. ఇంతకీ అక్కడికి వెళ్లాక ఏం జరిగిందీ? తాత బ్రహ్మకు భూమి రాసిచ్చాడా?ఆ భూమిని ఇవ్వడానికి ఏవైనా షరతులు పెట్టాడా? తాత వృద్ధాశ్రమంలో ఉండటానికి కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories