చిరు కోసం చరణ్ కీలక నిర్ణయం!

చిరు కోసం చరణ్ కీలక నిర్ణయం!
x
Highlights

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి.

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపైనా ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది.

ఇటీవల ‘పెద్ది’ నుంచి విడుదలైన ‘చికిరి’ సాంగ్ పెద్ద హిట్ అయింది. దీంతో రెండో సాంగ్‌ను డిసెంబర్ 31న రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేసింది. కానీ రామ్ చరణ్ దాన్ని ఆపేశాడు. కారణం సంక్రాంతికి చిరంజీవి సినిమా రాబోతోంది.

ఆ సినిమా సాంగ్‌ను కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ చేయనున్నారు. తండ్రి సినిమాను డిస్టర్బ్ చేయొద్దని చరణ్ భావించాడు. డిసెంబర్ మొత్తం చిరంజీవిదే అవ్వాలని నిర్ణయించాడు. సంక్రాంతి తర్వాతే తన సినిమా అప్‌డేట్లు ఇవ్వాలని బుచ్చిబాబుకు సూచించాడు. ఎలాగో అనిల్ రావిపూడి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తాడు. దీంతో ఆ గ్యాప్ మొత్తం చిరు సినిమాకే ఇవ్వాలని చరణ్ అభిప్రాయపడ్డాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories