Chaurya Paatam Review: సినిమా తీయాలనుకున్న యువకుడు దొంగగా ఎందుకు మారాడు.. ధనపల్లి బ్యాంకులో అసలేం జరిగింది..?

Chaurya Paatam Review: సినిమా తీయాలనుకున్న యువకుడు దొంగగా ఎందుకు మారాడు.. ధనపల్లి బ్యాంకులో అసలేం జరిగింది..?
x
Highlights

దొంగతనం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి మంచి విజయాన్ని అందుకున్నాయి కూడా. దొంగతనం, కామెడీ కలగలిపిన సినిమా టాలీవుడ్ లో హిట్ ఫార్ములాగా చెప్పొచ్చు.

సినిమా: చౌర్య పాఠం

నటీనటులు: వెలివెల ఇంద్ర, రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల

డెరైక్టర్: నిఖిల్ గొల్లమరి

మ్యూజిక్: దావ్జాండ్

ప్రొడ్యూసర్: నక్కిన నరేటివ్స్

రేటింగ్ : 3 / 5

దొంగతనం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి మంచి విజయాన్ని అందుకున్నాయి కూడా. దొంగతనం, కామెడీ కలగలిపిన సినిమా టాలీవుడ్ లో హిట్ ఫార్ములాగా చెప్పొచ్చు. ఇలాంటి కథంతోనే వచ్చింది కొత్త సినిమా చౌర్య పాఠం. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. నిఖిల్ గొల్లమూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆయన మొదటి ప్రయత్నమే అయినా, మేటి దర్శకుడిలా సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న త్రినాథరావు ఈ సినిమాతో నిర్మాత‌గా మార‌డం విశేషం. ఇంత‌కీ సినిమా ఎలా ఉంది.? ప్రేక్ష‌కుల‌ను ఏమేర ఆక‌ట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..

క‌థేంటంటే..

ఓ యువకుడు సినిమా తీయాలని కలలు కంటాడు. కానీ ఆ కల నెరవేర్చడానికి డబ్బులు అవసరం. అక్కడే వస్తుంది అసలైన ట్విస్ట్. ఎలాగైనా డ‌బ్బు సంపాదించాల‌నే ఉద్దేశంతో దొంగ‌త‌నం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ధనపల్లి అనే ఊరిలో ఉన్న బ్యాంకును ల‌క్ష్యంగా చేసుకుంటారు. అయితే ప్ర‌ణాళికులు అనుకున్న‌ట్లు సాగ‌వు. అనుకోని సంఘటనలు, విచిత్రమైన పరిణామాలు ఎదుర‌వుతాయి. ఇంత‌కీ హీరో ప్లాన్ స‌క్సెస్ అయ్యిందా.? అస‌లేమైంది.? తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే.

ఎవ‌రెలా చేశారు.?

ఇంద్ర రామ్ హీరోగా ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. అతని ఎక్స్‌ప్రెషన్లు, టైమింగ్ బాగున్నాయి. ముఖ్యంగా కామెడీ స‌న్నివేశాల్లో మంచి న‌ట‌నను క‌న‌బ‌రిచాడు. పాయల్ రాధాకృష్ణ నేచురల్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తన స్థాయికి తగినట్టే నటనతో మెప్పించారు. మిగతా క్యారెక్టర్లు కూడా చక్కగా రాణించారు.

సాంకేతికంగా చూస్తే..

సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని పనిచేసిన విధానం విజువల్స్‌కు బలాన్నిచ్చింది. గ్రామీణ ప్రాంతం, టన్నెల్ వాతావరణం బాగా తెర‌కెక్కించారు. డేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. నిర్మాణ విలువల విషయంలో కూడా మంచి కేర్ తీసుకున్నారు.

మొత్తంగా చెప్పాలంటే..

‘చౌర్యపాఠం’ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన థ్రిల్లింగ్ జ‌ర్నీగా చెప్పొచ్చు. కామెడీ, క్రైమ్, థ్రిల్ ఇలా అన్నీ అంశాల‌ను స‌మ‌పాల‌లో ఉండేలా చూసుకున్నారు. క‌థ‌నం వేగంగా ఉండ‌డంతో సినిమా ఎక్క‌డా బోర్ కొట్టిన‌ట్ల భావ‌న క‌ల‌గ‌దు. ముఖ్యంగా సెకాండ్‌ఫ్‌లో వ‌చ్చే ట్విస్టులు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. దొంగ‌త‌నం నేప‌థ్యంలో తెర‌కెక్కినా నైతిక విలువ‌ల ప్రాధాన్య‌త‌ను కూడా ఇందులో ప్ర‌స్తావించారు.

కామెడీ, ఉత్కంట‌, వినూత్న‌త‌.. ఈ మూడింటి మిశ్ర‌మ‌మే చౌర్య‌పాఠం. కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్స‌హిస్తూ, స‌రికొత్త కామెడీతో వ‌చ్చిన ఈ మూవీ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల‌కు వినోద‌ల జ‌ల్లును అందిస్తుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories