Chhaava: మరో రికార్డ్.. అక్కడ బహుబలి2 రికార్డ్ బీట్ చేసిన ఛావా

Chhaava beats Baahubali 2 in Bollywood
x

మరో రికార్డ్.. అక్కడ బహుబలి2 రికార్డ్ బీట్ చేసిన ఛావా

Highlights

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఛావా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకోగా.. తాజాగా బాహుబలి రికార్డును బీచ్ చేసి మరో మైలురాయిని చేరుకుంది.

Chhaava : విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఛావా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకోగా.. తాజాగా బాహుబలి రికార్డును బీచ్ చేసి మరో మైలురాయిని చేరుకుంది. దీంతో విక్కీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి2 గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు గుర్తింపు తెచ్చింది. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. హిందీలో ఈ చిత్రం రూ.510 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పుడీ కలెక్షన్లను ఛావా అధిగమించింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా ఇప్పటివరకు బాలీవుడ్‌లో రూ.516 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో 25 రోజుల్లోనే బాలీవుడ్‌లో బాహుబలి2 రికార్డును చెరిపేసి చరిత్ర సృష్టించింది. అంతేకాదు హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమా ఛావా నిలిచింది.

అంతేకాదు మార్చి 7న తెలుగులో విడుదలైన ఇక్కడ కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ చాలా కష్టపడ్డారని గతంలో చిత్రబృందం తెలిపింది. శంభాజీ మహారాజ్‌గా కనిపించేందు 6 నెలల పాటు శిక్షణ తీసుకున్నట్టు విక్కీ ఇప్పటికే తెలిపారు. రోజుకు 6 నుంచి 8 గంటలకు పైగా శిక్షణ కోసమే కేటాయించనని అన్నారు. ఆయనలా దృఢమైన శరీరంలో కనిపించేందుకు కండలు పెంచడమే కాకుండా సుమారు 100 కేజీలు వరకు విక్కీ బరువు పెరిగిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్‌గా నిలిచిన ఛావా ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఓటీటీలో విడుదలయ్యాక అక్కడ కూడా రికార్డులు నెలకొల్పడం ఖాయమంటున్నారు అభిమానులు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రష్మిక ఏసుభాయి పాత్రలో నటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories