చికిరి చికిరి 100 మిలియన్లు దాటింది — రామ్‌చరణ్ మేకింగ్ వీడియో వైరల్

చికిరి చికిరి 100 మిలియన్లు దాటింది — రామ్‌చరణ్ మేకింగ్ వీడియో వైరల్
x

చికిరి చికిరి 100 మిలియన్లు దాటింది — రామ్‌చరణ్ మేకింగ్ వీడియో వైరల్

Highlights

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘చికిరి చికిరి’ జపమే వినిపిస్తోంది. గత కొన్ని నెలల్లో హిందీ నుంచి తెలుగు వరకు ఏ పాటకూ రాలేని రెస్పాన్స్‌ ఈ పాటకు లభించడం ప్రత్యేకం.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘చికిరి చికిరి’ జపమే వినిపిస్తోంది. గత కొన్ని నెలల్లో హిందీ నుంచి తెలుగు వరకు ఏ పాటకూ రాలేని రెస్పాన్స్‌ ఈ పాటకు లభించడం ప్రత్యేకం. ఇదంతా జరుగుతుండడంతో, ‘అఖండ తాండవం’ రెండు పాటలు, ‘రాజా సాబ్’ నుంచి టైటిల్ సాంగ్ వచ్చినా… వాటి కంటే వేగంగా పాపులర్ అయినది మాత్రం చికిరి చికిరే.

ఇటీవల ఈ పాట అన్ని భాషలు కలిపి 100 మిలియన్ల వ్యూస్ దాటింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ ఈ సాంగ్‌ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో చూస్తే టీమ్ ఏ స్థాయిలో కష్టపడిందో స్పష్టంగా తెలుస్తుంది. 45 నిమిషాల ట్రెక్కింగ్ చేసి, ఎత్తైన కొండలు ఎక్కి, రిస్కీ లొకేషన్లలో ఈ పాటను షూట్ చేశారు.

వీడియోలో కనిపించే లొకేషన్లు నిజంగా వామ్మో అనిపించేలా ఉన్నాయి. కొంచెం జారి పడినా లోయలో పడిపోయే ప్రమాదం ఉన్న చోట టీమ్ మొత్తం షూట్ చేయడం నిజంగా అడ్వెంచర్‌ లాంటి విషయం. రామ్‌చరణ్ స్టెప్పులు ఎలా తీశారో కూడా మేకింగ్ వీడియోలో చూపించారు.

ఇప్పటికే ‘చికిరి చికిరి’ జ్వరం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌ను పట్టిపీడిస్తోంది. ఈ మేకింగ్ వీడియోతో అది మరింత వేగం అందుకుంది. పెద్దగా కొత్త విజువల్స్ లేకపోయినా… మేకింగ్‌లో కనిపించిన జాన్వీ కపూర్, రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు మధ్య జరిగిన సరదా మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చరణ్ బుచ్చిబాబును "తలాతల" అని సంబోధించడం కామెంట్స్‌లో హైలైట్ అవుతోంది.

ఇప్పుడు ఫ్యాన్స్‌ దృష్టి మొత్తం నెక్స్ట్ ఆడియో సింగిల్ పై ఉంది. డిసెంబర్ చివర్లో నూతన సంవత్సరం కానుకగా రిలీజ్ చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘శంకరవరప్రసాద్ గారు’ వంటి సినిమాలతో క్లాష్ రాకుండా చూసుకుంటే మంచిదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

‘పెద్దికీ’ ఇప్పటివరకు 60% షూటింగ్ పూర్తి అయింది. ఇంకా రెండు మూడు కీలక షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. వాటిలో మిగతా పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ చిత్రీకరణ ఉంది. గ్రాఫిక్స్ పెద్దమొత్తంలో అవసరం లేకపోయినా, కంటెంట్ డిమాండ్ మేరకు వాడతారట.

మార్చి 27 విడుదలను మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు పూర్తి స్థాయిలో బుచ్చిబాబు భుజాలపై పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories