జానీ మాస్టర్‌పై మళ్లీ చిన్మయి ధ్వజం!

జానీ మాస్టర్‌పై మళ్లీ చిన్మయి ధ్వజం!
x

జానీ మాస్టర్‌పై మళ్లీ చిన్మయి ధ్వజం!

Highlights

సినీ రంగంలో మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా చిన్మయి గళం విప్పుతూనే ఉన్నారు.

సినీ రంగంలో మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా చిన్మయి గళం విప్పుతూనే ఉన్నారు. జానీ మాస్టర్‌పై మైనర్ ఆరోపణలపై మరోసారి విరుచుకుపడ్డారు. తప్పు సమర్థనలు ఆగాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరారు.

కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు, దాడులపై చిన్మయి శ్రీపాద గట్టిగా స్పందిస్తున్నారు. ఎవరైనా పెద్దవారు, పరిచయస్తులైనా వెనుకాడకుండా విమర్శిస్తారు. ప్రోత్సాహకులు, కాపాడిన ప్రభుత్వాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది డాన్స్ మాస్టర్ జానీపై వచ్చిన ఆరోపణల సమయంలోనూ గళం విప్పారు. బాధితురాలికి న్యాయం, కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాజాగా మరోసారి జానీ మాస్టర్‌పై విరుచుకుపడ్డారు. "పెద్దవాడు మైనర్‌తో సంబంధం పెట్టుకోవడం పెను తప్పు" అని ట్వీట్ చేశారు.

సినీ ప్రభావంతో న్యాయం కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. "నేను మాట్లాడితే ఆయన భార్య ఫోన్ చేసి ఆపమంటుంది." అని చెప్పారు. మైనర్లను వేధించే వారు తప్పించుకోవడం బాధాకరమని, బాధితురాలు ధైర్యంగా నిలబడి విజయం సాధించాలని కోరారు. అయితే ఆమె ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి దాంట్లో ఆమె వేలు పెట్టడం నెటిజనులకు నచ్చడం లేదు. అందుకే ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు కొందరు. దీనిపై చిన్మయి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories