ఊరిస్తున్న తారలు.. ఏడాదంతా పండగే పండుగ.

Chiranjeevi, Balakrishna and  other heros cinemas to be released 2025 year
x

ఊరిస్తున్న తారలు.. ఏడాదంతా పండగే పండుగ..

 

Highlights

ఈ ఏడాది చిన్న హీరోల నుంచి అగ్ర హీరోల సినిమాల విడుదలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ ఏడాది చిన్న హీరోల నుంచి అగ్ర హీరోల సినిమాల విడుదలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. దీంతో మరోసారి థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపించనుంది. ఈ ఏడాది పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండడంతో వారి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలతో పండగను ఎంజాయ్ చేశారు సినీ ప్రియులు. నాగచైతన్య తండేల్ మొదలుకొని అగ్రహీరోల సినిమాలు చాలానే తెరకెక్కుతున్నాయి.బాలకృష్ణ, రామ్ చరణ్ సంక్రాంతి హీరోలుగా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చారు. డబుల్ బొనాంజా ఆఫర్‌లా ఆఖండ2తో ఈ ఏడాదిలోనే మరోసారి అలరించనున్నారు బాలకృష్ణ. సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. బోయపాటి శ్రీను కుంభమేళాలో అఖండ2 షూటింగ్ గురించి చెప్పి హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఈ మూవీపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాలు సూపర్ హిట్‌ కావడంతో బాలయ్య మంచి దూకుడు మీదున్నారు. మరి అఖండ 2 ఎలాంటి టాక్ తెచ్చుకుంటోందో చూడాలి.

హీరో నాగార్జున రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అయితే సోలోగా కాదు. ధనుష్‌తో కుబేర, రజనీకాంత్‌తో కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజాసాబ్. ఈ సినిమా విడుదల కూడా ఈ ఏడాదిలోనే ఉండనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్న పవన్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు సైతం నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ రాబిన్ హుడ్ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారన్నది ఇప్పటికీ చిత్ర బృందం ప్రకటించలేదు. కానీ ఈ ఏడాదే విడుదల కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ కూడా ఈ ఏడాదే విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ వార్2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 14న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉంటే.. కూలీ సినిమాతో రజనీకాంత్, థగ్ లైఫ్ సినిమాతో కమల్ హాసన్, రెట్రోతో సూర్య, కాంతారా చాప్టర్1 తో రిషబ్‌శెట్టి, పట్టుదల, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో అజిత్, టాక్సిక్ చిత్రంతో యశ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories