Chiranjeevi: డీప్‌ఫేక్ బారిన మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు

Chiranjeevi: డీప్‌ఫేక్ బారిన మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు
x

Chiranjeevi: డీప్‌ఫేక్ బారిన మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు

Highlights

సినీ మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ బారిన పడటం తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.

సినీ మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ బారిన పడటం తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. దుండగులు చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోలు కొద్ది గంటల్లోనే నెట్టింట వ్యాపించడంతో చిరంజీవి వెంటనే హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు.

సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిరంజీవి మాట్లాడుతూ, “డీప్‌ఫేక్‌ టెక్నాలజీని దుర్వినియోగం చేసి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం అత్యంత దారుణం. నా పేరుతో అశ్లీల వీడియోలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.

ఇటీవల చిరంజీవి తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వాడరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పు ఉన్నప్పటికీ డీప్ ఫేక్ దాడులు ఆగడం లేదు.

ఇక సినీ ప్రపంచాన్ని వణికిస్తున్న ఐ బొమ్మ, బప్పం టీవీ, తమిళ రాకర్స్ వంటి వెబ్‌సైట్లు విదేశీ ఐపీ అడ్రెస్‌లతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున, వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇక సినీ విషయానికొస్తే – చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్’ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. అలాగే నాగార్జున వందో చిత్రమైన ‘లాటరీ కింగ్’ లో కూడా చిరంజీవి కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories