Kodamasimham Re-Release: కొదమసింహం రీ రిలీజ్… చరణ్ చిన్ననాటి సీక్రెట్ బయటపెట్టిన చిరు

కొదమసింహం రీ రిలీజ్… చరణ్ చిన్ననాటి సీక్రెట్ బయటపెట్టిన చిరు
x

కొదమసింహం రీ రిలీజ్… చరణ్ చిన్ననాటి సీక్రెట్ బయటపెట్టిన చిరు

Highlights

నవంబర్‌ 21న రీ రిలీజ్‌ కాబోతున్న కొదమసింహం మూవీ మెగా స్టార్‌ చిరంజీవి కెరీర్లో హిట్‌ అయిన సినిమా సినిమాతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్న చిరంజీవి కుమారుడు రామ్‌ చరణ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన చిరంజీవి రామ్ చరణ్‌ చిన్నప్పుడు వాళ్లమ్మ కొదమసింహం సినిమా క్యాసెట్ పెడితేనే,..

తాజాగా మెగా స్టార్‌ చిరంజీవి తన కుమారుడు రామ్‌ చరణ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపారు. చిరంజీవి కెరీర్లో హిట్‌ సినిమాలో ఒకటైన, ఎంతో స్పెషల్‌ అయిన సినిమా కొదమ సింహం నవంబర్‌ 21న రీ రిలీజ్‌ కానుంది. ఈ సినిమా రీ రిలీజ్‌ సందర్భంగా చిరంజీవి సినిమాతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. కొదమ సింహం సినిమాలో స్టిల్‌ అంటే తనకు చాలా ఇష్టమని.. మొదటిసారి క్లీన్‌ షేవ్‌ కాకుండా గడ్డంతో చేసిన సినిమా ఇదేనని తెలిపారు. ఈ సినిమా తనకంటే చరణ్కి ఎక్కువ ఇష్టమని…అప్పట్లో రామ్ చరణ్‌ చిన్నప్పుడు వాళ్లమ్మ కొదమసింహం సినిమా క్యాసెట్ పెడితే కానీ భోజనం చేసేవాడు కాదని చెప్పారు. చిరు చరణ్ గురించి మాట్లాడిన ఈ మాటలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories