Vishwambhara: కేన్స్‌లో ‘విశ్వంభర’ బుక్ లాంచ్.. ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటంటే?

Vishwambhara: కేన్స్‌లో ‘విశ్వంభర’ బుక్ లాంచ్.. ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటంటే?
x
Highlights

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, వశిష్ట దర్శకత్వంలో వస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara)పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, వశిష్ట దర్శకత్వంలో వస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara)పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే చిరంజీవిని కేంద్రంగా భారీ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీ టీజర్‌ విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ, అందుకు బదులుగా ‘విశ్వంభర బుక్’ను విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని నిర్మాత విక్రమ్ తాజాగా రిలీజ్ చేయగా, ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా కోసం రూ.200 కోట్ల బడ్జెట్‌తో, 13 ప్రత్యేకమైన సెట్‌లను వేసి, ఓ ప్రత్యేకమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించినట్టు సమాచారం. ఇంత భారీ స్థాయిలో చిరంజీవి గతంలో ఎప్పుడూ సినిమా చేయలేదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘‘విశ్వంభర మీ ముందుకు ఓ అద్భుతమైన ప్రపంచాన్ని తీసుకొస్తోంది. ఆ బుక్‌లో ఏముందో తెలుసుకోవాలంటే ఇంకాస్త వెయిట్ చేయండి’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు చిన్న గ్లింప్స్, రెండు పాటలతో అభిమానుల్లో ఆసక్తిని పెంచిన ఈ మూవీ నుంచి త్వరలో టీజర్ విడుదల కానున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories