Bigg Boss Telugu 9 : 11వ వారం నామినేషన్స్.. రీతూకి ఎక్కువగా నామినేషన్లు.. అయినా ఎలా సేవ్ అయింది?

Bigg Boss Telugu 9 : 11వ వారం నామినేషన్స్.. రీతూకి ఎక్కువగా నామినేషన్లు.. అయినా ఎలా సేవ్ అయింది?
x

Bigg Boss Telugu 9 : 11వ వారం నామినేషన్స్.. రీతూకి ఎక్కువగా నామినేషన్లు.. అయినా ఎలా సేవ్ అయింది?

Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. 11వ వారానికి సంబంధించిన నామినేషన్స్ హౌస్‌లో పెద్ద గొడవలకు దారి తీశాయి.

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. 11వ వారానికి సంబంధించిన నామినేషన్స్ హౌస్‌లో పెద్ద గొడవలకు దారి తీశాయి. దాదాపు పది వారాల తర్వాత మొదటిసారి ఇమ్మన్యుయేల్ నామినేషన్స్‌లోకి వచ్చాడు. నామినేషన్స్ సందర్భంగా ఇమ్మూ-భరణి మధ్య, అలాగే దివ్య-రీతూ చౌదరి మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది. ఈ వారం నామినేషన్స్ లిస్ట్ చూస్తుంటే.. ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగిందా? అనే అనుమానాలు వస్తున్నాయి.

నామినేషన్స్ ప్రక్రియలో ఇమ్మన్యుయేల్, భరణిని టార్గెట్ చేశాడు. భరణి గేమ్ సరిగ్గా ఆడట్లేదని ఇమ్మూ నామినేట్ చేయగా, దానికి భరణి గట్టి కౌంటర్ ఇచ్చాడు. "మిస్టర్ ఇమ్మన్యుయేల్.. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మొన్న జరిగిన టెడ్డీ టాస్క్‌లో నువ్వు ప్రతిసారీ నా కంటే లేట్‌గా వచ్చావు. నేను గేమ్ సరిగ్గా ఆడట్లేదంటావా?" అని భరణి ప్రశ్నించాడు. "మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారనే కదా నేను అలా అంటున్నాను. కానీ మీరు ప్రతి టాస్క్‌లో ఆడట్లేదు" అని ఇమ్మూ రిప్లై ఇచ్చాడు.

దీనికి సీరియస్ అయిన భరణి, లెట్ మీ ఫినిష్ మై పాయింట్స్ అంటూ గట్టిగా అరిచాడు. నా బాడీకి ఆరోగ్యం బాలేదు, నా మైండ్‌కి కాదు అని కోపంతో సమాధానం చెప్పాడు. ఈ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు భరణి నుంచి కోరుకునే ఫైర్ ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. తర్వాత వచ్చిన కళ్యాణ్, డెమాన్ పవన్ ని నామినేట్ చేశాడు.

నామినేషన్స్ సమయంలో దివ్య, రీతూ చౌదరి మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది. రీతూ వచ్చి దివ్యని నామినేట్ చేస్తూ నేను నీకంటే బెటర్.. సూపర్ అని నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు అంది. దానికి దివ్య కౌంటర్ ఇస్తూ మరి నా గేమ్ గురించి కాకుండా నీ గేమ్ గురించి చెప్పాలా? నీకంటే ఎందుకు బెటరో నేను చెప్తాను అని సవాల్ చేసింది. మొన్న కెప్టెన్సీ టాస్క్‌లో కూడా నువ్వు ఓడిపోయావు అని రీతూకి గుర్తు చేసింది. తర్వాత దివ్య కూడా రీతూని నామినేట్ చేయడంతో వారి మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.

ఈ వారం నామినేషన్స్ లిస్ట్ చూస్తే, ఇదంతా బిగ్ బాస్ ప్లానింగ్‌లో భాగంగానే జరిగిందని అనుమానం వస్తుంది. ఈ 11వ వారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ పడాల, భరణి, సంజన, డెమాన్ పవన్, దివ్య. అయితే ఈ వారం అందరికంటే ఎక్కువ నామినేషన్లు పడ్డ రీతూ చౌదరి నామినేషన్స్ నుంచి సేవ్ కావడం విశేషం. ఈ నామినేషన్స్ ప్రక్రియలో కెప్టెన్ తనుజ కీలక పాత్ర పోషించింది. ఆమె ఎవరికి ఎన్ని నామినేషన్లు ఇవ్వాలనే టోకెన్ ఇచ్చింది. ఇమ్మూ, భరణి, డెమాన్ పవన్ ఈ ముగ్గురూ రీతూ చౌదరిని నామినేట్ చేశారు. కానీ రీతూ మాత్రం తనని నామినేట్ చేసిన ఈ ముగ్గుర్నీ కాకుండా.. దివ్య, సంజనలను నామినేట్ చేసింది.

చివరికి, అందరికంటే ఎక్కువ నామినేషన్లు (4 నామినేషన్లు) పడ్డ రీతూ చౌదరిని.. తన కెప్టెన్సీ పవర్‌తో తనుజ సేవ్ చేసి, నామినేషన్స్ నుంచి బయటపడేసింది. దీన్ని బట్టి చూస్తే.. డెమాన్ పవన్, రీతూల మధ్య లవ్ డ్రామాను కొనసాగించడానికి అలాగే షోకి హైప్ తీసుకురావడానికి ఇదంతా బిగ్ బాస్ స్క్రిప్ట్‌లో భాగమే అనే అంచనాకు రావచ్చు. కెప్టెన్‌కు సేవింగ్ పవర్ ఇవ్వడం, తనుజ ఆ పవర్‌ను రీతూపై ఉపయోగించడం మొత్తం ముందే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories