Dua's First Look : తొలిసారిగా బయటపడ్డ దీపికా-రణ్‌వీర్ ముద్దుల కూతురు ఫోటో..ఆమె ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా ?

Duas First Look : తొలిసారిగా బయటపడ్డ దీపికా-రణ్‌వీర్ ముద్దుల కూతురు ఫోటో..ఆమె ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా ?
x

Dua's First Look : తొలిసారిగా బయటపడ్డ దీపికా-రణ్‌వీర్ ముద్దుల కూతురు ఫోటో..ఆమె ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా ?

Highlights

బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ జంట దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్. వీరి గారాల పట్టి, ముద్దుల కూతురు దువా గురించి ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.

Dua's First Look : బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ జంట దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్. వీరి గారాల పట్టి, ముద్దుల కూతురు దువా గురించి ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. దీపావళి సందర్భంగా దీపికా-రణ్‌వీర్ తమ కుమార్తె దువాతో ఉన్న ప్రత్యేక ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్ 8, 2024న జన్మించిన దువా, తొలిసారి అందరి ముందుకొచ్చింది. అయితే, ఈ చిన్నారికి వారసత్వంగా రాబోతున్న రూ. 1315 కోట్ల భారీ సంపద గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

దీపావళి పండుగ సందర్భంగా హీరోయిన్ దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ప్రత్యేక ఫోటోలను పంచుకున్నారు. ఇందులో ఆమె, రణ్‌వీర్ సింగ్ తమ కుమార్తె దువాతో కనిపించారు. సెప్టెంబర్ 8, 2024 న జన్మించిన దువా, తొలిసారిగా అభిమానులకు కనిపించింది. ఈ ఫోటోలలో రణ్‌వీర్ తన కూతురిని ప్రేమగా చేతుల్లో పట్టుకుని నవ్వుతుండగా, దీపికా మురిపెంగా చూస్తున్నారు. దువా ముద్దు ముద్దు నవ్వులు అభిమానుల హృదయాలను గెలిచాయి.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో లక్షలాది లైకులు, కామెంట్లు వచ్చాయి. ఈ ముద్దుల చిన్నారి ఇప్పటికే కోట్లకు అధిపతి అయ్యిందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీపికా పదుకొణె భారతదేశంలో భారీ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. దీపికా సినిమాల ద్వారా మాత్రమే కాకుండా బ్రాండ్ ప్రమోషన్లు, పెట్టుబడుల ద్వారా కూడా భారీగా ఆర్జిస్తున్నారు. నివేదికల ప్రకారం, ఆమె ఒక ప్రకటన కోసం రూ. 8 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు.

అనేక పెద్ద బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా పనిచేస్తున్న దీపికా, ఫ్యాషన్, హెల్త్ స్టార్టప్‌లలో కూడా పెట్టుబడులు పెట్టారు. మీడియా నివేదికల ప్రకారం ఆమె నికర సంపద రూ. 900 కోట్లకు పైనే ఉంటుంది. రణ్‌వీర్ సింగ్ కూడా బాలీవుడ్‌లో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రణ్‌వీర్ సింగ్ 2010లో బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి, అనేక హిట్ చిత్రాలను అందించారు. తన ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రసిద్ధి చెందారు. నివేదికల ప్రకారం, రణ్‌వీర్ నికర సంపద రూ. 415 కోట్లుగా అంచనా వేయబడింది. దీపికా (రూ. 900 కోట్లు+), రణ్‌వీర్ (రూ. 415 కోట్లు)ల మొత్తం సంపద దాదాపు రూ. 1315 కోట్లుగా అంచనా. ఈ సంపద మొత్తానికి దువా వారసురాలు కానుంది. అంతేకాకుండా, ఈ దంపతులు తమ కుమార్తె పేరు మీద మరిన్ని ఆస్తులు కూడబెడుతున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories