Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఇది.. 40 కోట్ల బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్‌ను తిరస్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఇది.. 40 కోట్ల బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్‌ను తిరస్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం!
x
Highlights

Pawan Kalyan: జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన విలువలను చాటుకున్నారు.

Pawan Kalyan: జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన విలువలను చాటుకున్నారు. రాజకీయాల్లోనే కాకుండా సామాజిక బాధ్యతలోనూ తాను అందరికంటే భిన్నమని నిరూపించుకున్నారు. కేవలం నిముషాల వ్యవధిలో అధికారులకు ఆదేశాలిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడమే కాకుండా, తన వ్యక్తిగత లాభం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి ఒక భారీ వాణిజ్య ఒప్పందాన్ని తిరస్కరించారు.

ఏకంగా రూ. 40 కోట్ల ఆఫర్!

తాజా సమాచారం ప్రకారం, ఒక ప్రముఖ టొబాకో (పొగాకు) కంపెనీ తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్‌ను సంప్రదించింది. ఇందుకు గానూ ఆయనకు ఏకంగా రూ. 40 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. అయితే, ఈ ఆఫర్‌ను వినగానే పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలోచించకుండా ‘నో’ చెప్పేసినట్లు తెలుస్తోంది.

ప్రజల ఆరోగ్యంపై పవన్ నిబద్ధత

పొగాకు ఉత్పత్తుల వల్ల సమాజంలో చాలా మంది ఆరోగ్య సమస్యల బారిన పడతారని, తనను బ్లైండ్‌గా ఫాలో అయ్యే యువత తప్పుడు మార్గంలో వెళ్లకూడదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. "మనం చేసే పనుల వల్ల ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరికీ ఇబ్బంది కలగకూడదు" అని పవన్ కళ్యాణ్ తరచుగా చెప్పే మాటను ఈ సందర్భంగా ఆయన ఆచరించి చూపారు.

సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు

పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై జనసైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఫిదా అవుతున్నారు.

ఇటీవల పవన్ గురుద్వారాను సందర్శించి ‘పగిడి’ ధరించిన ఫోటోలు వైరల్ కాగా, ఇప్పుడు ఈ 40 కోట్ల నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆయన హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ వరకు ప్రతిదీ ఫాలో అయ్యే అభిమానుల కోసం, ఇంత పెద్ద మొత్తాన్ని వదులుకోవడం పవన్ రేంజ్ ఏంటో చెప్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కేవలం మాటలకే పరిమితం కాకుండా, ప్రజలకు మేలు చేసే విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలు ఆయన్ను ఒక గొప్ప నేతగా నిలబెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories