బాక్సాఫీస్ వద్ద 'దేవగుడి' ప్రభంజనం: ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి!

Devagudi Movie Success Meet: చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం "దేవగుడి".
Devagudi Movie Success Meet: చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం "దేవగుడి". పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఘనంగా 'సక్సెస్ మీట్' నిర్వహించింది.
ప్రతి పాత్రకూ దక్కిన గుర్తింపు:
ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. "మీడియా మిత్రులు, ప్రేక్షకులు అందించిన ఈ విజయం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఉండటమే ఈ సక్సెస్‌కు కారణం. ముఖ్యంగా రఘు కుంచె పోషించిన 'వీరారెడ్డి' పాత్రకు, అభినవ్ శౌర్య, నరసింహ, అనుశ్రీల నటనకు వస్తున్న ప్రశంసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.
హీరో కావాలన్న కలను నిజం చేసింది:
హీరో అభినవ్ శౌర్య ఉద్వేగానికి లోనవుతూ.. "హీరో కావాలని నేను కన్న కలను ఈ చిత్రం నిజం చేసింది. థియేటర్లలో నన్ను ప్రేక్షకులు 'ధర్మ' అని పిలుస్తుంటే నా శ్రమంతా మర్చిపోయాను. జాతర నేపథ్యంలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది" అన్నారు.
తెలుగు అమ్మాయికి దక్కిన గౌరవం:
హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. "శ్వేతారెడ్డి పాత్రలో నన్ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరు అద్భుతం. నేను చేసిన ఫైట్స్, డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతుంటే నటిగా నా శ్రమ ఫలించిందని అనిపిస్తోంది" అని పేర్కొన్నారు.
కెరీర్ బెస్ట్ రోల్ - రఘు కుంచె:
ప్రముఖ నటుడు రఘు కుంచె మాట్లాడుతూ.. "కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. వీరారెడ్డిగా నా కెరీర్లోనే ఇది బెస్ట్ రోల్. పక్కా ప్లానింగ్‌తో సినిమాను ఆడియెన్స్ వరకు తీసుకెళ్లిన రామకృష్ణారెడ్డి గారి కృషి అభినందనీయం" అని ప్రశంసించారు. నటుడు నరసింహ తోషి కూడా ఈ విజయం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, అదిరిపోయే పాటలు, యాక్షన్ సీన్లతో "దేవగుడి" ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా థియేటర్లకు రప్పిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



