Danush : ధనుష్‌కి ఈ కష్టాలు అవసరమా? సింపతీ కోసం ఇలాంటి కథలు చెప్తే ఎలా!

Danush : ధనుష్‌కి ఈ కష్టాలు అవసరమా? సింపతీ కోసం ఇలాంటి కథలు చెప్తే ఎలా!
x

Danush : ధనుష్‌కి ఈ కష్టాలు అవసరమా? సింపతీ కోసం ఇలాంటి కథలు చెప్తే ఎలా!

Highlights

సినిమా ప్రచారం కోసం నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఏ స్థాయికైనా వెళ్తారు. కొన్నిసార్లు వారి జీవితంలో జరగని సంఘటనలను జరిగినట్లుగా చెప్పి, సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ధనుష్ కూడా ఇదే ట్రిక్ ఉపయోగించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన ఇంత దిగజారాల్సిన అవసరం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Danush : సినిమా ప్రచారం కోసం నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఏ స్థాయికైనా వెళ్తారు. కొన్నిసార్లు వారి జీవితంలో జరగని సంఘటనలను జరిగినట్లుగా చెప్పి, సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ధనుష్ కూడా ఇదే ట్రిక్ ఉపయోగించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన ఇంత దిగజారాల్సిన అవసరం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల చెన్నైలో ఇడ్లీ కొట్టు అనే సినిమా ప్రమోషన్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో ధనుష్ నటించారు. ఈ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇడ్లీ కొనడానికి తాను పూలు అమ్ముకున్నానని ఆయన చెప్పారు. ఆయన మాటలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సినిమా ప్రచారం కోసం ఆయన చేసిన ట్రిక్ అని చాలా మంది అంటున్నారు.

ధనుష్ ఏం చెప్పారు?

ధనుష్ మాట్లాడుతూ.. “నా చిన్నతనంలో నేను ప్రతిరోజూ ఇడ్లీ తినాలని కోరుకునేవాడిని. కానీ వాటిని కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. అందుకే మేము పూలను సేకరించేవాళ్లం. మేము ఎన్ని పూలు సేకరిస్తామో దానిపై మాకు వచ్చే డబ్బులు ఆధారపడి ఉండేవి. నాతో పాటు నా సోదరి, బంధువులు కూడా ఈ పని చేసేవాళ్లు” అని ఆయన అన్నారు.

“ఈ పని చేసినందుకు మాకు ఒక్కొక్కరికి 2 రూపాయలు వచ్చేవి. ఆ తర్వాత, మేము స్థానిక పంప్‌సెట్‌కి వెళ్లి స్నానం చేసేవాళ్లం. కేవలం ఒక టవల్‌తో ప్రధాన రహదారిపై నడిచేవాళ్లం. ఆ డబ్బుతో మాకు నాలుగు నుండి ఐదు ఇడ్లీలు వచ్చేవి. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆహారం తిన్నప్పుడు కలిగే తృప్తి, రుచిని ఏదీ అధిగమించలేదు. నా చిన్నతనంలో నేను అనుభవించిన భోజనం రుచి ఇప్పుడు నాకు దొరకడం లేదు” అని ధనుష్ చెప్పారు.

వివాదం ఎందుకు?

ధనుష్ ప్రఖ్యాత దర్శకుడు కస్తూరి రాజా కొడుకు. అందుకే ధనుష్ మాటలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కస్తూరి రాజా ధనుష్‌కి డబ్బులు ఇవ్వలేదా? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఇది సానుభూతి పొందేందుకు చేసిన ట్రిక్ అని అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ధనుష్ స్వాభిమాని కాబట్టి ఇలా చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories