Dhurandhar Budget: 'ధురందర్' ఫుల్ బడ్జెట్ డీటైల్స్ ఇవే.. రణవీర్ సింగ్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?

Dhurandhar Budget: ధురందర్ ఫుల్ బడ్జెట్ డీటైల్స్ ఇవే.. రణవీర్ సింగ్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?
x
Highlights

Dhurandhar Budget: బాలీవుడ్‌లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ సంచలన విజయం సాధించిన సినిమా ‘ధురందర్’.

Dhurandhar Budget: బాలీవుడ్‌లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ సంచలన విజయం సాధించిన సినిమా ‘ధురందర్’. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ 2025 డిసెంబర్ 5న విడుదలై.. బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టింస్తోంది. సీక్రెట్‌ ఏజెంట్‌గా రణ్‌వీర్‌ రా రస్టిక్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు. ధురందర్ వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూళ్లు రూ.1400 కోట్లకు పైగా నమోదయ్యాయి. అయితే ఈ సినిమా బడ్జెట్, రెవెన్యూ వివరాలు హాట్ టాపిక్‌గా మారాయి. భారీ తారాగణం, గ్రాండ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, టాప్ క్లాస్ VFX (విజువల్ ఎఫెక్ట్స్)తో రూపొందిన ఈ సినిమా ఖర్చులనుంచి లాభాల వరకూ పూర్తి లెక్కలు బయటకు వచ్చాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

మొత్తం ప్రొడక్షన్ బడ్జెట్ సుమారు రూ.250 కోట్లుగా అంచనా. ఇందులో ప్రొడక్షన్ ఖర్చులకు రూ.120 కోట్లు కాగా.. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం రూ.45 కోట్లు వెచ్చించారు. భారీ సెట్లు, విభిన్న లోకేషన్ల కోసం రూ.35 కోట్లు, సహాయ నటులు అండ్ టెక్నికల్ క్రూ కోసం రూ.40 కోట్లు ఖర్చయ్యాయి. సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా గ్రాండ్ లెవెల్‌లో జరిగింది. దీనికోసం మొత్తం రూ.75 కోట్లు కేటాయించారు. ఇందులో డిజిటల్ మార్కెటింగ్‌కు రూ.25 కోట్లు, మీడియా ప్రచారానికి రూ.30 కోట్లు, ప్రీమియర్ షోలు సహా ప్రమోషనల్ ఈవెంట్స్‌కు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

ఇక ధురందర్ నటీనటుల పారితోషికాల విషయానికి వస్తే.. హీరో రణవీర్ సింగ్ రూ.50 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. విలన్ పాత్రలో నటించిన సంజయ్ దత్ రూ.8 కోట్లు, ముఖ్య పాత్రలో కనిపించిన ఆర్. మాధవన్ రూ.9 కోట్లు, అక్షయ్ ఖన్నా రూ.3 కోట్లు, అర్జున్ రాంపాల్ 1 కోటి పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల పరంగా చూస్తే ధురందర్ రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. ఓటీటీ డీల్ ద్వారా రూ.150 కోట్లు, శాటిలైట్ హక్కుల ద్వారా రూ.45 కోట్లు, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.18 కోట్లు వచ్చాయి. ఇవన్నీ కలిపి ప్రీ-రిలీజ్ అండ్ నాన్-థియేట్రికల్ రెవెన్యూలతోనే భారీ మొత్తాన్ని రాబట్టింది. థియేట్రికల్ రన్‌తో కలిపి మొత్తం రెవెన్యూ సుమారు రూ.1243 కోట్లు కాగా..వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూళ్లు రూ.1400 కోట్లకు పైగా నమోదయ్యాయి. పెట్టిన ప్రతి రూపాయికి భారీ లాభాలు తెచ్చిన సినిమాగా ధురందర్ బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. భారీ బడ్జెట్ అయినా, అంతకంటే భారీ రిటర్న్స్‌తో ఇది నిజమైన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories