Dil Raju: సల్మాన్ ఖాన్‌తో దిల్ రాజు భారీ ఒప్పందం..!

Dil Raju: సల్మాన్ ఖాన్‌తో దిల్ రాజు భారీ ఒప్పందం..!
x

Dil Raju: సల్మాన్ ఖాన్‌తో దిల్ రాజు భారీ ఒప్పందం..!

Highlights

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మళ్లీ బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు. లాభాల్లో పెద్ద వాటా ఇస్తూ సల్మాన్‌ను ఒప్పించారు.

Dil Raju: హిట్, జర్సీ వంటి తెలుగు చిత్రాల హిందీ రీమేక్‌లను నిర్మించిన దిల్ రాజు మళ్లీ బాలీవుడ్‌లో సందడి చేయనున్నారు. రెండు పెద్ద చిత్రాలు చేయనున్నారు. మొదటి చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ అధికారికంగా అంగీకారం తెలిపారు. షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. దిల్ రాజు గతంలోనే సల్మాన్‌కు మంచి అడ్వాన్స్ చెల్లించారు. భారీ రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో పెద్ద వాటా తీసుకునేలా సల్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

కనీస రెమ్యూనరేషన్ ఇచ్చి లాభాల్లో గణనీయ వాటా ఇస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు. దీనికి సల్మాన్ సమ్మతి తెలిపారు. తారాగణం, సాంకేతిక నిపుణులు ఖరారు కాగానే అధికారిక ప్రకటన వెలువడనుంది. అదనంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కూడా వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. దిల్ రాజు ఈ రెండు చిత్రాలతో బాలీవుడ్‌లో మరోసారి సత్తా చాటనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories