Pawan Kalyan: పవన్‌తో సినిమా వార్తలపై అనిల్ రావిపూడి క్లారిటీ.. అసలు విషయం ఇదీ!

Pawan Kalyan: పవన్‌తో సినిమా వార్తలపై అనిల్ రావిపూడి క్లారిటీ.. అసలు విషయం ఇదీ!
x

Pawan Kalyan: పవన్‌తో సినిమా వార్తలపై అనిల్ రావిపూడి క్లారిటీ.. అసలు విషయం ఇదీ!

Highlights

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజే ‘ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్’ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మెగా సక్సెస్‌తో అనిల్ రావిపూడి క్రేజ్ టాలీవుడ్‌లో స్కై హైకి చేరింది. అయితే, అనిల్ తన తదుపరి చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై తాజాగా అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‌తో సినిమా గురించిన వార్తలపై అనిల్ స్పందిస్తూ.. "నేను ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కలవలేదు. ఆయనతో సినిమా చేయాలనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ కల నెరవేరితే నాకంటే సంతోషించే వారు ఉండరు" అని తన మనసులోని మాటను బయటపెట్టారు.

అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశం లేదని అనిల్ సూటిగా చెప్పారు. "ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సేవలో ఎంతో బిజీగా ఉన్నారు. ఆయనపై అనేక బాధ్యతలు ఉన్నాయి. మా ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు కుదురుతుందనే విషయంలో నాకూ క్లారిటీ లేదు. ఇప్పటి వరకు మా మధ్య అలాంటి చర్చలేవీ జరగలేదు. భవిష్యత్తులో ఏదైనా కుదిరితే తప్పకుండా తెలియజేస్తాను" అని ఆయన వెల్లడించారు.

చిరు సినిమాతో పెరిగిన అంచనాలు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మరియు చిరంజీవి మాస్ ఇమేజ్ తోడైన ‘మన శంకర’ చిత్రం విజయంతో.. అనిల్ తదుపరి హీరో ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ రావడంతో, అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీని ఎవరితో అనౌన్స్ చేస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories