
రజనీకాంత్ తో నెల్సన్ సినిమా లేనట్టేనా
Nelson Dileep Kumar: పుకార్ల పై క్లారిటీ ఇస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్
Nelson Dileep Kumar: సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ని ప్రకటించారు. తలైవర్ 169 గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మించాల్సి ఉంది. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించడానికి సిద్ధమయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పట్టాలు ఎక్కేలా కనిపించటం లేదు. "కో కో కోకిల" సినిమాతో మంచి హిట్ అందుకున్న నెల్సన్ ఆ తర్వాత "డాక్టర్" సినిమాతో మరొక హిట్ అందుకున్నారు. క్రైమ్ కామెడీస్ తో డార్క్ హ్యూమర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన దిలీప్‌కుమార్ తాజాగా విజయ్ హీరోగా "బీస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా రిజల్ట్ చేసిన తర్వాత రజినీకాంత్ మరియు సన్ పిక్చర్స్ దిలీప్ కుమార్ తో చేయాల్సిన సినిమా కాన్సిల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు నెల్సన్. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్ ఎకౌంట్లో #తలైవర్169 అని కూడా రాసుకొని తన తదుపరి సినిమా రజినీకాంత్ తోనే అని ఇన్‌డైరెక్టుగా చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire