Disha Patani: సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. కారణం ఇదే !

Disha Patani
x

Disha Patani: సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. కారణం ఇదే !

Highlights

Disha Patani : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటి దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది.

Disha Patani: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటి దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. శుక్రవారం (సెప్టెంబర్ 12) తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉన్న ఆమె నివాసం ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరట కలిగించే విషయం. అయితే, ఈ దాడి వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.

కాల్పుల ఘటన జరిగిన తర్వాత, ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. అందులో ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని పేర్కొన్నారు. "జై శ్రీరామ్. సహోదరులందరికీ రామ్ రామ్. వీరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్ అనే మేము దిశా పటానీ, ఖుష్బూ పటానీ ఇంటి ముందు కాల్పులు జరిపాము. ఆమె ప్రేమనాథ్ జీ మహారాజ్, అనిరుద్ధాచార్యాజీ మహారాజ్ లను అవమానించింది. ఆమె మా సనాతన ధర్మాన్ని అగౌరవపరచడానికి ప్రయత్నించింది. మా దేవుళ్లను అవమానిస్తే మేము సహించము. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో ఆమె లేదా మరెవరైనా మా ధర్మాన్ని అగౌరవపరిస్తే, వారి కుటుంబంలో ఎవరూ బతికి ఉండరు" అని ఆ పోస్ట్‌లో బెదిరించారు.

ఈ మెసేజ్ దిశా పటానీకి మాత్రమే కాదని, సినిమా ఇండస్ట్రీలోని కళాకారులందరికీ హెచ్చరిక అని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. "భవిష్యత్తులో మా ధర్మం, సాధువులను ఎవరైనా అవమానిస్తే, దాని పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మా ధర్మాన్ని రక్షించడానికి మేము ఏ స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వెనక్కి తగ్గము. మాకు ధర్మం, సమాజం రెండూ ఒక్కటే. వాటిని రక్షించడం మా మొదటి కర్తవ్యం" అని ఆ పోస్ట్‌లో రాశారు.

కాల్పులకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కూడా స్పందించారు. ఈ బెదిరింపు సందేశం ఉన్న సోషల్ మీడియా పోస్ట్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దాడికి రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్ బాధ్యత వహించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గతంలో హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కూడా కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఆయన భద్రతను పెంచారు. ఇలా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని తరచుగా కాల్పుల ఘటనలు జరుగుతుండటంతో చిత్ర పరిశ్రమలో ఆందోళన నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories