Biggboss : బిగ్ బాస్ నుంచి దివ్య ఎలిమినేట్..తను వెళ్లిపోవడానికి కారణాలివే

Biggboss :  బిగ్ బాస్ నుంచి దివ్య ఎలిమినేట్..తను వెళ్లిపోవడానికి కారణాలివే
x

Biggboss : బిగ్ బాస్ నుంచి దివ్య ఎలిమినేట్..తను వెళ్లిపోవడానికి కారణాలివే

Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఊహించినట్టే తక్కువ ఓటింగ్ శాతం కారణంగా కంటెస్టెంట్ దివ్య హౌస్‌ను వీడాల్సి వచ్చింది.

Biggboss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఊహించినట్టే తక్కువ ఓటింగ్ శాతం కారణంగా కంటెస్టెంట్ దివ్య హౌస్‌ను వీడాల్సి వచ్చింది. గత వారం ఎలిమినేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న దివ్య, ఈ వారం మాత్రం తప్పించుకోలేకపోయింది. నామినేషన్స్‌లో చివరిగా మిగిలిన దివ్య, సుమన్ శెట్టిని హోస్ట్ నాగార్జున యాక్టివిటీ ఏరియాకు పిలిపించారు. అక్కడ వారికి ప్రత్యేకంగా రూపొందించిన అగ్నిపర్వతం సెటప్‌ను చూపించారు. ఎరుపు రంగు వస్తే ఎలిమినేట్ అయినట్టు, ఆకుపచ్చ వస్తే సేఫ్ అయినట్టు ప్రకటించారు. ఈ ఉత్కంఠ రౌండ్‌లో సుమన్ శెట్టి సేఫ్ అవ్వగా, దివ్య పోసిన లిక్విడ్ కు ఎరుపు రంగు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు.

దివ్య ఎలిమినేషన్‌కు ప్రధాన కారణంగా ఆమె ప్రవర్తనే అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భరణితో ఆమె ఏర్పరచుకున్న స్నేహంలో చూపించిన పెత్తనం, అసూయతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చలేదు. భరణిపై ఆమె కంట్రోల్ చూపించడం వల్ల అతని ఆట కూడా దెబ్బతిందని, దివ్య బయటికి వెళితే భరణి బాగా ఆడతాడనే ఉద్దేశంతోనే ప్రేక్షకులలో నెగిటివిటీ పెరిగిందని తెలుస్తోంది. హౌస్ నుంచి బయలుదేరే ముందు, దివ్య భరణిని ఆలింగనం చేసుకుని ఎమోషనల్ అయింది. భరణితో పాటు, సుమన్ శెట్టి, తనూజ, ఇమ్మానుయేల్, రీతూలకు కూడా సలహాలు ఇచ్చి, అందరినీ కలిసి బయటికి వచ్చింది.

బిగ్ బాస్ స్టేజ్ మీదకు రాగానే, దివ్య తన ఆట గురించి రివ్యూ ఇస్తూ, తాను గేమ్ పరంగా 100% ప్రయత్నించానని, కానీ వ్యక్తిగత సంబంధాల వల్ల ఎక్కువ ప్రభావితం అయ్యానని చెప్పింది. దివ్య జర్నీని నాగార్జున మెచ్చుకుంటూ, ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి కూడా 12వ వారం వరకు ఉండటం గొప్ప విషయమని అన్నారు. హౌస్‌మేట్స్ గురించి మాట్లాడుతూ, ముఖ్యంగా భరణి గెలవాలని కోరుకుంటున్నానని, పవన్ తన కోసం ఆడాలని, ఇమ్మానుయేల్‌ను తన కంటే బెటర్ ప్లేయర్ అని ఒప్పుకుంటున్నానని చెప్పింది. ఈ ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఇప్పుడు కేవలం 8 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.

Show Full Article
Print Article
Next Story
More Stories