Bigg Boss: రంగంలోకి డిప్యూటీ సీఎం.. తెరుచుకున్న బిగ్‌బాస్‌ డోర్స్‌

Bigg Boss: రంగంలోకి డిప్యూటీ సీఎం.. తెరుచుకున్న బిగ్‌బాస్‌ డోర్స్‌
x

Bigg Boss: రంగంలోకి డిప్యూటీ సీఎం.. తెరుచుకున్న బిగ్‌బాస్‌ డోర్స్‌

Highlights

Bigg Boss: కర్ణాటకలో కాలుష్య నియంత్రణ మండలి అధికారుల చర్య కారణంగా ఆగిపోయిన కన్నడ బిగ్‌బాస్ షోకు ఎదురైన అతి పెద్ద అడ్డంకి తొలగిపోయింది.

Bigg Boss: కర్ణాటకలో కాలుష్య నియంత్రణ మండలి అధికారుల చర్య కారణంగా ఆగిపోయిన కన్నడ బిగ్‌బాస్ షోకు ఎదురైన అతి పెద్ద అడ్డంకి తొలగిపోయింది. బుధవారం మంగళవారం సీల్ వేయబడిన బిగ్‌బాస్ హౌస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (డీసీఎం) డీకే శివకుమార్ తక్షణ జోక్యంతో తిరిగి తెరుచుకుంది. దీంతో షో నిర్వాహకులు, అభిమానులు మరియు హోస్ట్ కిచ్చా సుదీప్ తీవ్ర ఒత్తిడి నుంచి బయటపడ్డారు.

అసలేం జరిగింది?

బిడదిలోని ‘జాలీవుడ్’ స్టూడియోలో బిగ్‌బాస్ చిత్రీకరణ జరుగుతుండగా, ప్రతిరోజూ దాదాపు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీటిని పర్యావరణంలోకి విడుదల చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా, నిర్వాహకులు పట్టించుకోలేదు. ఫలితంగా, తహసీల్దారు తేజస్విని ఆధ్వర్యంలో అధికారులు హౌస్‌కు తాళాలు వేసి సీల్ చేశారు.

డీకే శివకుమార్ జోక్యం

ఈ సమస్య డీసీఎం డీకే శివకుమార్ దృష్టికి వెళ్లగానే, ఆయన వెంటనే స్పందించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు కన్నడ వినోద పరిశ్రమకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని పేర్కొంటూ, స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశించారు. డీసీఎం ఆదేశాల మేరకు అధికారులు వెంటనే సీల్‌ను తొలగించారు.

ఈ సందర్భంగా షో వ్యాఖ్యాత కిచ్చా సుదీప్, సరైన సమయంలో స్పందించినందుకు డీకే శివకుమార్‌కు, సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories