Drishyam 3: దృశ్యం–3 రిలీజ్ డేట్ ఫిక్స్.. 2026 అక్టోబర్ 2న థియేటర్లలోకి

దృశ్యం–3 రిలీజ్ డేట్ ఫిక్స్.. 2026 అక్టోబర్ 2న థియేటర్లలోకి
x

దృశ్యం–3 రిలీజ్ డేట్ ఫిక్స్.. 2026 అక్టోబర్ 2న థియేటర్లలోకి

Highlights

బాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఫ్రాంచైజీ ‘దృశ్యం’ మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడానికి సిద్ధమవుతోంది.

బాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఫ్రాంచైజీ ‘దృశ్యం’ మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడానికి సిద్ధమవుతోంది. అజయ్ దేవగన్, శ్రియ సరన్ జంటగా నటించిన దృశ్యం తొలి భాగం బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, దానికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం–2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ హిట్ సిరీస్‌కు మూడో భాగంగా ‘దృశ్యం–3’ రాబోతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం ‘దృశ్యం–3’ 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో అజయ్ దేవగన్ మరోసారి విజయ్ సాల్గావ్కర్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడు.

ఇప్పటికే దృశ్యం–3 షూటింగ్ ప్రారంభమైందని చిత్రబృందం వెల్లడించింది. భారీ షెడ్యూల్‌తో పలు లొకేషన్లలో షూటింగ్ జరగనుండగా, కథకు సంబంధించిన కీలక సన్నివేశాలు అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు టబు, శ్రియ సరన్, రజత్ కపూర్ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మునుపటి రెండు భాగాల మాదిరిగానే ఈసారి కూడా కథ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. స్టార్ స్టూడియోస్ 18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తుండగా, కథ–స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే రెండు భాగాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దృశ్యం ఫ్రాంచైజీ, మూడో భాగంతో మరోసారి సంచలనం సృష్టించనుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories