దృశ్యం 3 హక్కులు భారీ ధరకు విక్రయం… అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారా?

దృశ్యం 3 హక్కులు భారీ ధరకు విక్రయం… అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారా?
x

దృశ్యం 3 హక్కులు భారీ ధరకు విక్రయం… అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారా?

Highlights

దృశ్యం 3 ప్రకటించినప్పటి నుంచే భారతీయ సినిమా అభిమానుల్లో ఒకే సందేహం – అన్ని భాషల్లో ఒకేసారి విడుదల అవుతుందా?

ఇప్పటికే మలయాళ వెర్షన్‌ షూటింగ్‌ జోరుగా సాగుతోంది. అయితే ఇతర భాషల గురించి స్పష్టమైన సమాచారం మాత్రం బయటకు రాలేదు. ఇదే సమయంలో ఆశీర్వాద్ మూవీస్‌ ఈ చిత్రానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌, డిజిటల్‌ రైట్స్‌ను భారీ మొత్తానికి విక్రయించింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన పనోరమా స్టూడియోస్‌ ‘దృశ్యం 3’ విడుదల హక్కులను 160 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఎక్కువగా హిందీ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసే ఈ సంస్థ చేతుల్లో హక్కులు ఉండటంతో, హిందీ–మలయాళంలో ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

మలయాళ విడుదల కొంచెం ఆలస్యమే?

థియేట్రికల్‌ రైట్స్‌ పనోరమా స్టూడియోస్‌ చేతికి వెళ్లడంతో మలయాళ వెర్షన్‌ విడుదల కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్‌.

హిందీ వెర్షన్‌ ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే డిసెంబరు నెలలో షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

తెలుగులో వెంకటేశ్‌ బిజీ – ఏ సినిమాకు ప్రాధాన్యం?

తెలుగులో ఈ సినిమా వెంకటేశ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అదే సమయంలో దృశ్యం 3 కూడా చేయాల్సి ఉండటంతో డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం కీలకం కానుంది.

జీతూ జోసెఫ్‌ మలయాళ వెర్షన్‌ను చాలా వేగంగా షూట్‌ చేసే దర్శకుడిగా పేరు. కాబట్టి మలయాళ పార్ట్‌ పూర్తయిపోయేలోపే ఇతర భాషల పనులు కూడా స్టార్ట్‌ అయ్యే అవకాశముంది.

దృశ్యం ప్రాంచైజీ – ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌ హిస్టరీ

మోహన్‌లాల్ – జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో వచ్చిన దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు అన్ని భాషల్లోనూ అపార విజయాలు సాధించాయి. ఒక కుటుంబం చుట్టూ జరుగే థ్రిల్లింగ్‌ క్రైమ్‌ డ్రామాగా ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా కట్టిపడేశాయి.

ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీ 240 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది.

అందుకే దృశ్యం 3పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories