Urvashi Rautela : విజయ్ దేవరకొండ, రానా, ఇప్పుడు ఊర్వశి రౌతేలా.. ఈడీ గురి సెలబ్రిటీల పైనేనా?

Urvashi Rautela : విజయ్ దేవరకొండ, రానా, ఇప్పుడు ఊర్వశి రౌతేలా.. ఈడీ గురి సెలబ్రిటీల పైనేనా?
x

Urvashi Rautela : విజయ్ దేవరకొండ, రానా, ఇప్పుడు ఊర్వశి రౌతేలా.. ఈడీ గురి సెలబ్రిటీల పైనేనా?

Highlights

ఆన్ లైన్ బెట్టింగ్ అప్లికేషన్లు, ఆన్ లైన్ జూదాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. గతంలో కేవలం కొన్ని స్కిల్ గేమ్స్ కు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, అక్రమ మార్గాల్లో చాలా బెట్టింగ్ యాప్స్ భారతదేశంలో పనిచేస్తున్నాయి. ఇలాంటి బెట్టింగ్ అప్లికేషన్లకు చాలా మంది ప్రముఖ నటీనటులు, క్రీడాకారులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు.

Urvashi Rautela : ఆన్ లైన్ బెట్టింగ్ అప్లికేషన్లు, ఆన్ లైన్ జూదాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. గతంలో కేవలం కొన్ని స్కిల్ గేమ్స్ కు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, అక్రమ మార్గాల్లో చాలా బెట్టింగ్ యాప్స్ భారతదేశంలో పనిచేస్తున్నాయి. ఇలాంటి బెట్టింగ్ అప్లికేషన్లకు చాలా మంది ప్రముఖ నటీనటులు, క్రీడాకారులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. మరికొందరు నటీనటులు ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు కూడా పెట్టారని సమాచారం. ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ కేసులో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ నటీనటులకు సమన్లు, నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.

చాలా ప్రజాదరణ పొందిన 1xbet అనే బెట్టింగ్ అప్లికేషన్‌కు సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు నటి ఊర్వశి రౌతేలా, మాజీ ఎంపీ, హీరోయిన్ మిమి చక్రవర్తికి సమన్లు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇద్దరికీ వేర్వేరు తేదీలను కూడా కేటాయించారు.

మిమి చక్రవర్తిని సెప్టెంబర్ 15న, ఊర్వశి రౌతేలాను సెప్టెంబర్ 16న ఈడీ అధికారుల ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ ఇద్దరూ 1xbet బెట్టింగ్ అప్లికేషన్ కోసం ప్రచారం చేశారని, అందుకు గాను డబ్బులు అందుకున్నారని సమాచారం. ఇదే కేసులో గత ఆగస్టు నెలలో క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌కు కూడా ఈడీ సమన్లు ఇచ్చి విచారణ జరిపింది.

కొన్ని వారాల క్రితం, ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురు తెలుగు నటీనటులకు కూడా నోటీసులు పంపారు. నటులు ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి మరికొంతమంది నటీనటులకు నోటీసులు పంపి విచారణకు పిలిచారు. ఈడీ నోటీసుల గురించి స్పందిస్తూ మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. "ఈ అధికారుల దర్యాప్తు నాకు నవ్వు తెప్పిస్తోంది. వారు ఎప్పుడూ కేసులో చివరి వ్యక్తిని విచారిస్తారు. మేము కేవలం ప్రకటనలలో నటించిన వాళ్లం మాత్రమే. మీరు నోటీసు ఇచ్చి విచారించాల్సింది ఆ బెట్టింగ్ అప్లికేషన్లను ప్రారంభించిన వారిని" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories