Yash: యశ్ నెక్స్ట్ సినిమా ఏంటి?

Yash: నెక్స్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు

admin1
Updated on: 22 April 2022 8:12 AM IST
Fans Looking Forward To The Next Movie
X

Yash: యశ్ నెక్స్ట్ సినిమా ఏంటి?

Yash: 2018 వరకు యశ్ అంటే కేవలం కన్నడ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. రాకింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న యష్ గూగ్లీ, గజకేసరి, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి, మాస్టర్ పీస్, సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్ సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు. కానీ 2018లో విడుదలైన "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారింది. యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక తాజాగా ఈ సినిమాకి రెండవ భాగంగా "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా విడుదలై మొదటి భాగం కంటే భారీ కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. "చాప్టర్ 1" తోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన యశ్ "చాప్టర్-2" తో మరొక బ్లాక్బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం అభిమానులు అందరూ యశ్ తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా యశ్ తన నెక్స్ట్ సినిమా పై సంతకం చేయలేదు కాబట్టి తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

admin1

admin1

Next Story