Biggboss : బిగ్ బాస్ 9లో మొదటి వారమే షాకింగ్ ఓటింగ్.. టాప్ 1లో ఆయనే, లాస్ట్ ప్లేస్‌లో ఆ ఇద్దరు!

Biggboss : బిగ్ బాస్ 9లో మొదటి వారమే షాకింగ్ ఓటింగ్.. టాప్ 1లో ఆయనే, లాస్ట్ ప్లేస్‌లో ఆ ఇద్దరు!
x

Biggboss : బిగ్ బాస్ 9లో మొదటి వారమే షాకింగ్ ఓటింగ్.. టాప్ 1లో ఆయనే, లాస్ట్ ప్లేస్‌లో ఆ ఇద్దరు!

Highlights

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌ మొదటి వారం నామినేషన్ ప్రక్రియ బుధవారం పూర్తయింది. సాధారణంగా నామినేషన్స్ సోమవారం ఎపిసోడ్‌లోనే పూర్తవుతాయి. కానీ ఈసారి బుధవారం వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగడంపై ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది.

Biggboss : బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌ మొదటి వారం నామినేషన్ ప్రక్రియ బుధవారం పూర్తయింది. సాధారణంగా నామినేషన్స్ సోమవారం ఎపిసోడ్‌లోనే పూర్తవుతాయి. కానీ ఈసారి బుధవారం వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగడంపై ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. ఈ సీజన్‌కు ప్రత్యేకంగా సెలిబ్రిటీ vs కామన్ మ్యాన్ అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. ఇందులో కామన్ పార్టిసిపెంట్స్‌కు ఓనర్స్ అని, సెలబ్రిటీలకు టెనెంట్స్ అని టైటిల్స్ ఇచ్చారు. గేమ్ ప్లాన్‌లో భాగంగా టెనెంట్స్ ఓనర్స్ కోసం ఇంటి పనులు, వంట చేయడం వంటివి చేయాలి.

ఎవరు నామినేట్ అయ్యారు?

బుధవారం నామినేషన్ల ప్రకారం, టెనెంట్స్ తరపున అందరూ నామినేట్ అయ్యారు. సెలబ్రిటీలలో భరణి ఒక్కరే తప్ప మిగతా అందరూ ఈ వారం ఎలిమినేషన్ రిస్క్‌లో ఉన్నారు. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఓనర్ అయిన డీమాన్ పవన్ మాత్రమే నామినేట్ అయ్యాడు. మొదటి వారంలో మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు: సంజన, రితు చౌదరి, తనుజ, సుమన్ శెట్టి, ఫ్లోరా షైని, సృష్టి వర్మ, రాము రాథోడ్, ఇమ్మాన్యుయేల్, దీమన్ పవన్.

సుమన్ శెట్టికి టాప్ ఓటింగ్..

మొదటి వారం ఎలిమినేషన్‌లో బయటకు వెళ్లే కంటెస్టెంట్లలో సుమన్ శెట్టి పేరు మొదటగా వినిపించింది. ఎందుకంటే, ఆయన మొదటి వారంలో కేవలం రెండు, మూడు సార్లు మాత్రమే నోరు తెరిచి మాట్లాడాడు. అప్పుడప్పుడు లైవ్ ఎపిసోడ్‌లో మాట్లాడినా, అది మెయిన్ ఎపిసోడ్‌లో కనిపించలేదు. బిగ్ బాస్ అంటే ముక్కుసూటిగా మాట్లాడాలి, ప్రతి దానిలో వేలు పెట్టాలి. కానీ సుమన్ శెట్టిలో ఈ లక్షణాలు ఏవీ లేవు. అందుకే అతను ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మొదటి వారం ఓటింగ్‌లో అందరినీ వెనక్కి నెట్టి టాప్ స్థానంలో నిలిచాడు.

అనధికారిక ఓటింగ్ ఫలితాలు..

సుమన్ శెట్టి 24 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. ఆయన తర్వాత సీరియల్ నటి తనుజ గౌడ 20 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో, డీమాన్ పవన్ 11 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ వారం వివాదాస్పద కంటెస్టెంట్ సంజన గల్రాని 8 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉండగా, రాము రాథోడ్‌కు కూడా 8 శాతం ఓట్లు వచ్చాయి. రీతు చౌదరికి కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫ్లోరా షైని, శ్రష్టి వర్మ 2 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉన్నారు. ఈ అనధికారిక ఓటింగ్ ప్రకారం, ఈ ఇద్దరిలో ఒకరు మొదటి వారంలో బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories